famous beautician nandini chowdary arrested in cheating case | women cheating cases | women affairs

Beautician nandini chowdary arrested in cheating case

beautician nandini chowdary, beautician nandini chowdary arrest, nandini chowdary arrest, beautician cheating case, hyderabad beautician arrested, women crime stories, women crime news, beautician cheated jewellery person

beautician nandini chowdary arrested in cheating case : the famous beautician nandini chowdary arrested for cheating a jewellery man in hyderabad.

ఆ బ్యూటీషియన్ అడ్డంగా బుక్కైంది!

Posted: 10/30/2015 01:23 PM IST
Beautician nandini chowdary arrested in cheating case

సమాజం పూర్తిగా మారిపోయింది.. డబ్బుల మాయలో పడి తూలుతున్న ప్రజలు దాన్ని ఆర్జించేందుకు అడ్డదారులు తొక్కుతున్నారు. పురుషులు మాత్రమే కాదు.. మహిళలూ సైతం తామేమీ తక్కువేం కాదన్నట్లు రకరకాల మార్గాలను అన్వేషిస్తున్నారు. వ్యాపారలేవాదేవీల్లో అనుభవమున్న మహిళలు ఇతరులకు టోకరా వేయడంలో తామే దిట్టగా నిరూపించుకుంటున్నారు. ఇదివరకే ఇలా ఎంతోమంది మహిళలు రకరకాల మోసాలకు పాల్పడుతూ అడ్డంగా బుక్కవ్వగా.. తాజాగా మరో మహిళ భారీ మోసం చేసి పట్టుబడింది. ప్రస్తుతం ఆమె జైల్లో ఊచలు లెక్కిస్తోంది.

ప్రముఖ బ్యూటీషియన్ అయిన యలమంచిలి నందిని చైదరి(29) జూబ్లీహిల్స్ రోడ్ నెం. 72లో ‘బ్లష్ స్పా అండ్ సెలూన్‌’ను నిర్వహిస్తోంది. దీంతోపాటు ఆభరణాల వ్యాపారం కూడా చేస్తోంది. తన స్పాకు వచ్చే సంపన్న మహిళలకు ఆమె ఈ నగలు చూపించి విక్రయిస్తోంది. ఇందులో భాగంగానే హుస్సేనిఆలంకు చెందిన ఆభరణాల వ్యాపారి సోమెన్‌ఘోష్ తో ఒప్పందం కుదుర్చుకుంది. ఆ ఒప్పందం ఏమిటంటే.. అతని దగ్గరు నుంచి 5 నెక్లెస్‌లు తీసుకున్న ఆమె.. వాటిని అమ్మిపెడతానని చెప్పింది. ఆ నెక్లెస్ లు అమ్ముడుపోతే అందుకుగాను రూ.50 లక్షలు ఇస్తానని ఆమె చెప్పగా.. సోమెన్ ఆ ఒప్పందానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. అయితే.. ఆమె మాత్రం వాటిని తన జల్సాలకు వినియోగించుకుంది. వాటిలో మూడు నెక్లెస్‌లను పాన్‌బ్రోకర్ వద్ద తనఖా పెట్టి రూ. 10 లక్షలు తీసుకుంది కానీ వాటిని తన స్వంత స్వలాభాల కోసం వాడుకుంది. ఇక మిగిలిన రెండు నెక్లెస్‌లను తాను ఇదివరకే చేసిన అప్పు తీర్చేందుకు మరో ఇద్దరికి ఇచ్చేసింది. ఈ విధంగా ఆ బ్యూటీషియన్ ఐదు నెక్లెస్ లను వాడేసుకుంది.

ఈ విషయం తెలుసుకున్న సోమెన్.. తన నెక్లెస్ లు లేదా ఒప్పందం ప్రకారం రూ. 50 లక్షలు ఇవ్వాలని అడిగాడు. తొలుత డబ్బులిస్తానంటూ వాయిదాలు వేసుకుంటూ వచ్చిన ఆమె.. చివరకు ఇవ్వనంటూ ముఖం చాటేసింది. దీంతో బాధితుడు నందినిచౌదరి తనను మోసం చేసిందని ఫిర్యాదు చేయగా.. పోలీసులు నిందితురాలిపై ఐపీసీ సెక్షన్ 420, 406, 506ల కింద కేసులు నమోదు చేసి గురువారం రిమాండ్‌కు తరలించారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : beautician nandini chowdary  money cheating cases  

Other Articles