Chinese sperm banks offers iPhone

Chinese sperm banks are trying to lure donors with apples newest iphone

china, Iphone6s, Chinese, Sperm Banks, Donors

Chinese sperm banks are trying to lure donors with Apples newest iPhone. Sperm banks in China are taking advantage of Apple’s popular iPhone to help recruit donors.

మగాళ్లు అది చేస్తే చాలు ఐఫోన్ వస్తుంది

Posted: 09/18/2015 08:17 AM IST
Chinese sperm banks are trying to lure donors with apples newest iphone

చైనా మొబైల్స్ అంటే మన దగ్గర ఎంత క్రేజ్ ఉందో చెప్పక్కర్లేదు. చైనాలో తయారైన ఫోన్లు మన దగ్గర విచ్చలవిడిగా అమ్ముడుపోతాయి. అయితే మరి చైనా వాళ్లకు ఎలాంటి ఫోన్లు నచ్చుతాయి. వాళ్లకు ఎలాంటి ఫోన్లు నచ్చితే మనకెందుకు కానీ.. అక్కడ కొంత మంది మాత్రం ఐఫోన్ల కోసం చెయ్యరాని పనులన్నీ చేస్తున్నారు. మొన్నటికి మొన్న కేవలం ఐఫోన్ల కోసం ఇద్దరు వ్యక్తులు తమ కిడ్నీలు అమ్ముకునేందుకు సిద్దపడ్డారు. ఆ వార్త బయటకు వచ్చిన మరో రెండు రోజుల తర్వాత ఆలాంటిదే మరొకటి వెలుగులోకి వచ్చింది. అయితే ఈ ఆఫర్ కేవలం మగవాళ్లకు మాత్రమే వర్తిస్తుంది. ఆడవాళ్లు ఈ ఆపర్ కు అర్హులు కారు. మగవాళ్లకు మాత్రమే వర్తించే ఆ ఆఫర్ ఎంటో తెలుసా.?

వీర్యం దానం చేయండి.. ఐఫోన్ పట్టుకెళ్లండి' అంటూ 'యాపిల్' ప్రియులను ఊరిస్తున్నాయి. ఇందుకోసం ఒక ప్రకటన కూడా ఇచ్చాయి. 'ఐఫోన్ 6 ఎస్ దక్కించుకునేందుకు కిడ్నీలు అమ్మాల్సిన పనిలేదు. జస్ట్ వీర్యం దానం చేస్తే చాలు ఐఫోన్ మీ సొంతమవుతుంద'ని ఎడ్వర్టైజ్ మెంట్ ఇచ్చాయి. 17 మిల్లీలీటర్ల వీర్యం దానం చేస్తే సుమారు 60 వేలు ఇస్తామని స్పెర్మ్ బ్యాంకులు ప్రకటించాయి. ఒక్కరు ఎన్నిసార్లైనా దానం చేయొచ్చు. అయితే ఒకసారి దానం చేసిన తర్వాత 48 రోజుల గ్యాప్ తీసుకోవాలని నిబంధన పెట్టింది. వీర్యం దానం చేసేందుకు ఎంతమంది ముందుకు వచ్చారనేది త్వరలోనే తెలుస్తుంది. షాంఘైలోని రెండు స్పెర్మ్ బ్యాంకులు మరో అడుగు ముందుకు వేసి యువతకు గాలం వేసి వీర్యదానం చేసిన వారికి ఐఫోన్లు ఇస్తామంటూ ఆఫర్ చేశాయి. అయితే వీర్యం దానం చేయడానికి కొన్ని అర్హతలు నిర్దేశించింది. చైనా గుర్తింపు కార్డు, కాలేజీ డిగ్రీతో పాటు తప్పనిసరిగా 165 సెంటీమీటర్ల ఎత్తు కలిగివుండాలి. కలిగివుండాలి. ఎటువంటి జన్యుపరమైన వ్యాధులు ఉండరాదు. పిచ్చి పీక్స్ లో ఉండటం అంటే ఇదే మరి పాడు ఫోన్ కోసం అడ్డమైన పనులు చేయాల్సిన అవసరం ఉందా..?

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : china  Iphone6s  Chinese  Sperm Banks  Donors  

Other Articles