Now Katju calls Bose as Japanese agent

Now katju calls bose as japanese agent

Netaji, Justice Markandey Katju, tagore, Japanese agent, Subhas Chandra Bose

In a series of tweets controversy-courting former Supreme Court judge Justice Markandey Katju described Subhas Chandra Bose as a "Japanese agent" and used the epithet "British stooge" for Rabindranath Tagore.

నేతాజీ ఓ జపాన్ ఏజెంట్: కట్జూ

Posted: 09/15/2015 03:36 PM IST
Now katju calls bose as japanese agent

మేదావులు మాట్లాడే మాటలు కాస్త మూర్ఖంగా అనిపించినా అదే నిజం అని చాలా మంది అంటారు. కానీ మన దేశంలో మేధావులు మాట్లాడే మాటల్లో చాలా మంది మాటలు మూర్ఖంగా... ఏ మాత్రం నమ్మశక్యం కానట్లు.. పైగా వివాదాలకు కేంద్ర బిందువులగా నిలుస్తాయి. తాజాగా మరోసారి తన మాటల తూటాలతో వివాదానికి తెర తీశారు మాజీ సుప్రీంకోర్ట్ న్యాయమూర్తి జస్టిస్ మార్కండేయ కట్జూ. అయితే మొన్నటికి మొన్న గాంధీ మీద వివాదాస్పద వ్యాఖ్యలే చేసి అందరికి చేత చివాట్లుతిన్న మార్కండేయ కట్జూ తాజాగా మరోసారి స్వాతంత్ర సమరయోధుల మీద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. దేశం మొత్తంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ మీద ఆసక్తికర చర్చ సాగుతోంది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ మిస్సింగ్ మిస్టరీ మీద త్వరలోనే 60 పత్రాలను అందరికి అందుబాటులోకి తీసుకురానున్నట్లు పశ్చియమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇప్పటి్కే వెల్లడించారు.

నేతాజీ గురించి దేశం మొత్తం ఒక చర్చసాగుతుంటే అసలు నేతాజీ ఎలాంటి వారో తెలుసా..? అతనో జపాన్ ఏజెంట్ అని తన బ్లాగ్ లో మార్కండేయ కట్జూ చేసిన వివాదాస్పద వ్యాసం కొత్త చర్చకు దారి తీసింది. అందులో నేతాజీతో పాటు రవీంద్రనాథ్ ఠాగూర్ మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అసలు నేతాజీ గురించి దేశం మొత్తం ఆసక్తికర చర్చసాగుతోంది.. అయితే విలువలకు, సంప్రదాయాలకు ఎంతో పేరున్న బెంగాల్ గడ్డ మీదున్న ప్రజలు కూడా అదే విశ్వాసాలను నమ్ముతున్నారని.. కానీ అవన్నీ నిజాలు కావని అన్నారు. త్వరలోనే తాను కోల్ కత్తాలో ఓ సభలో పాల్గొంటానని.. అక్కడ నేతాజీ గురించి, రవీంద్రనాథ్ ఠాగూర్ గురించి ఆధారాలతొ సహా నిరూపిస్తానని అన్నారు. మొత్తానికి నేతాజీ మీద, ఠాగూర్ మీద మార్కండేయ కట్జూ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి ఇప్పుడు మీడియాలో మార్కండేయ కట్జూ మీదే చర్చ సాగుతోంది.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Netaji  Justice Markandey Katju  tagore  Japanese agent  Subhas Chandra Bose  

Other Articles