High court | AP | Telangana | Helmet | sand Mafia

High court reprobate telugu states for their policies

High court, AP, Telangana, Helmet, sand Mafia

High court reprobate telugu states for their policies. Telangana govt took helmet compulsory for motorists. Ap govt issued new orders for sand.

తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు తలంటిన హైకోర్ట్

Posted: 09/08/2015 08:39 AM IST
High court reprobate telugu states for their policies

తెలుగు రాష్ట్రాల ప్రభుత్వ విధానాలపై హైకోర్టు సీరియస్ అయింది. తెలంగాణలో హెల్మెట్ వాడకం తప్పనిసరి చేయడం, ఏపీలో ఇసుక రీచ్ ల వ్యవహారంపై.. ఉన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. నిబంధనలు పాటించకుండా ఇష్టానుసారంగా వ్యవహారిస్తున్నారని అభిప్రాయపడింది. పూర్తి నివేదికలను కోర్టుకు సమర్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. ఉమ్మడి హైకోర్టులో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు సంబంధించిన పలు అంశాలపై విచారణ జరిగింది. తెలంగాణలో హెల్మెట్ వాడకం తప్పనిసరి చేయడంతో పాటు బైక్ తో పాటు హెల్మట్ కొనాలని ఆదేశిస్తూ జారీ అయిన జీవోను సవాల్ చేస్తూ దాఖలైన పిల్ పై ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇన్నాళ్లు మీరేం చేశారని రవాణా శాఖను కోర్టు ప్రశ్నించింది. 14 నెలల్లో 92 వేల కేసులు నమోదు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. అయితే హెల్మెట్ పై 15 రోజుల పాటు ప్రజలకు అవగాహన కల్పించి.. ఆ తర్వాత హెల్మెట్ వాడకాన్ని తప్పనిసరి చేయాలని ఆదేశించింది.

ఆంధ్రప్రదేశ్ లో ఇసుక మాఫియాపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. విచ్చలవిడిగా డ్వాక్రా గ్రూపులకు రీచ్ అనుమతులు ఇవ్వడంపై కలెక్టర్స్ తీరును తప్పుపట్టింది. సహజ వనరులు భవిష్యత్ తరాలకు ఉండాల్సిన అవసరముందని వాఖ్యానించింది. నీటి పరిరక్షణ కూడా కలెక్టర్ పరిధిలోకే వస్తుందని గుర్తుపెట్టుకోవాలని సూచించింది. మిషన్ తో ఇసుక తీయడానికి ఎలా అనుమతిస్తారని అసహనం వ్యక్తం చేసింది. వారం రోజుల్లో దీనిపై నివేదిక సమర్పించాలని కలెక్టర్స్ కు ఆదేశాలు జారీ చేసింది.అయితే గతంలోనూ తెలంగాణలో ఇసుక మాఫియాపై హైకోర్టు సీరియస్ అయింది. ఎవరెవరు మాఫియా వెనుక ఉన్నారో వారిపై కేసులు నమోదు చేయాలని ఆదేశించింది. ఇష్టానుసారంగా అనుమతులివ్వడంతోనే ఇసుక మాఫియాలు ఏర్పడుతున్నాయని ఉన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : High court  AP  Telangana  Helmet  sand Mafia  

Other Articles