1.5crore | cash in car | Suryapet

Police found one and half crore rupees in a car at suryapet busstand

Police, 1.5crore, cash in car, Suryapet, Suryapet busstand, 1.5cr in car

Police found one and half crore rupees in a car at suryapet busstand. In a car which parked in the suryapet busstand, police collect 1.5crore rupees in the back side of the car.

కార్ డిక్కీలో కోటిన్నర.. షాకైన పోలీసులు

Posted: 08/07/2015 08:26 AM IST
Police found one and half crore rupees in a car at suryapet busstand

నల్లగొండ జిల్లా సూర్యాపేట బస్టాండ్ లో రెండురోజులుగా ఆపి ఉంచిన ఓ కారు నుంచి పోలీసులు ఒకటిన్నర  కోట్లు స్వాధీనం చేసుకున్నారు. మూడు రోజుల కిందట కర్ణాటక రాష్ట్రంలోని బీజాపూర్ ఐసీఐసీఐ బ్యాంకులో చోరీకి గురైన డబ్బుగా గుర్తించారు. గురువారం సూర్యాపేట పోలీస్‌స్టేషన్‌లో విలేకరుల సమావేశంలో డీఎస్పీ ఎంఏ అబ్దుల్ రశీద్ వివరాలు తెలిపారు. సూర్యాపేట హైటెక్ బస్టాండ్‌లో ఖమ్మం బస్సులు ఆగే ప్లాట్‌ఫాం నుంచి బయటకు వెళ్లే మార్గంలో 50 మీటర్ల దూరంలో చెట్ల మధ్యలో ఫోర్డ్ ఫియస్టా క్లాసిక్ కారు(కేఏ 28ఎన్ 9119) రెండు రోజులుగా ఆగింది. ఎప్పుడూ బస్టాండ్‌కు రద్దీ ఎక్కువగా ఉండటంతో కారు ప్రయాణికులదే కావొచ్చని ఎవరూ పట్టించుకోలేదు. నిన్న రాత్రి జిల్లా ఎస్పీ ఆదేశాలతో డీఎస్పీ, పోలీస్ బృందం జేసీబీతో కారు డిక్కీని పగులగొట్టి ఓ బస్తామూట స్వాధీనం చేసుకున్నారు.

తీరా డిక్కీలోని మూటను విప్పి చూస్తే వెయ్యి రూపాయల నోట్ల కట్టలు 20 లక్షలు, 500 నోట్ల కట్టలు 1.30 కోట్లు ఉన్నట్లు గుర్తించారు. డబ్బును పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి భద్రపరిచారు. క్రేన్ సహాయంతో కారును స్టేషన్‌కు తరలించారు. నోట్లకట్టలపై బీజాపూర్ ఐసీఐసీఐ బ్యాంకు ముద్రలను గుర్తించారు. మూడు రోజుల కిందట బీజాపూర్‌లోని ఐసీఐసీఐ బ్యాంకులో చోరీ చేసిన డబ్బు కారులో తరలిస్తూ రెండు రోజుల కిందట సూర్యాపేటలో వదిలేసి వెళ్లినట్లు సమాచారం. బ్యాంకు ఉద్యోగిని అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా దొంగల ముఠా ఆచూకీ లభించింది. సూర్యాపేటలో కారును వదిలేశామని, డబ్బులు అందులో ఉన్నాయని నిందితులు అంగీకరించినట్లు తెలిసింది. అక్కడి పోలీసులు ఇచ్చిన సమాచారంతోనే సూర్యాపేటలో కారు నుంచి పోలీసులు డబ్బు స్వాధీనం చేసుకున్నారు. ఫక్రుద్దీన్ అహ్మద్ నదాఫ్ పేరుతో బీజాపూర్‌లో ఈ ఏడాది మే రెండో తేదీన కారు రిజిస్ట్రేషన్ అయినట్లు గుర్తించారు. సూర్యాపేట పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Police  1.5crore  cash in car  Suryapet  Suryapet busstand  1.5cr in car  

Other Articles