Rangam | Bhonalu | Hyderabad | swarnalatha

Amma told bhavishyavaani in bhonalu

Rangam, Bhonalu, Hyderabad, swarnalatha, Secundrabad, Rangam Bhavishyavaani

Amma told Bhavishyavaani in Bhonalu. Swarna Latha told some issues releated to deveotees at rangam Event.

ITEMVIDEOS: రంగంలో అమ్మవారు ఏం చెప్పారు?

Posted: 08/03/2015 11:54 AM IST
Amma told bhavishyavaani in bhonalu

లష్కర్ బోనాలు ఎంతో రంగరంగ వైభవంగా సాగుతున్నాయి. బోనమెత్తిన తెలంగాణ జాతరలో ఈ ఉదయం రంగంలో భవిష్య వాణి చెప్పిన అమ్మవారు. రంగంలో భక్తుల మనోభావాలను ప్రశ్నించిన ధర్మకర్తలు, పూజారులు. వర్షాలు పడటం లేదని భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.. మరి వర్షాల సంగతి ఏంటీ అని ప్రశ్నించారు. అయితే కష్టాల నుండి కాపాడేది నేనే అంటూ అమ్మ పలికింది. పచ్చికుండ మీద నిలబడి రంగం చెప్పిన స్వర్ణలతను ధర్మకర్తలు, పూజారులు ప్రశ్నించారు. ఎన్నో ఆటంకాలు జరుగుతున్నా తనకు పూజలు చేస్తున్నారని వారి భారం తనదే అని అమ్మ పలికింది. అయితే ఏర్పాట్ల మీద అమ్మవారు ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు ఏర్పాట్లు సరిగా జరగడం లేదని.. భక్తులు తన వద్దకు చేరడానికి చాలా కష్టపడాల్సి వస్తోందని అమ్మవారు వెల్లడించారు. ఎంతో వైభవంగా బోనాలు నిర్వహిస్తున్నామని అమ్మవారికి ధర్మకర్తలు వివరించారు.

నా కాసులెక్కడరా....? అని అమ్మవారు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను కళ్లు మూసుకొని చూసీ చూడనట్లుగా  ఉంటున్నానని అమ్మ వారు పలికారు. గతంలో పావలా, అర్త రూపాయి కానుకలు వచ్చినా ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని ఇప్పుడు ఆ పరిస్థితి లేదు అని వివరించారు. రాబడి పెరుగుతూ ఉంటే దోచుకునే వారి సంఖ్య పెరుగుతూ పోతోందని అన్నారు. తప్పు చేసిన వారిని శిక్షించేది తానే.. రక్షించేది తానే అని అమ్మవారు పలికారు. అయితే అమ్మ వారికి అన్నిరకాల పూజలు నిర్వహిస్తున్నామని. ఎలాంటి లోటు రాకుండా చూసుకుంటున్నామని ధర్మకర్తలు వివరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rangam  Bhonalu  Hyderabad  swarnalatha  Secundrabad  Rangam Bhavishyavaani  

Other Articles