Godavari Pushkaralu | Telangana, AP | KCR, Chandrababu naidu, Traffic jam

Heavy traffic jam on high ways in telugu states

Godavari Pushkaralu, Telangana, AP, KCR, Chandrababu naidu, Traffic jam

Heavy Traffic jam on High ways in Telugu states. In Telangana and Ap high ways blocked by the Godavari pushkaralu devotees vehicles.

ITEMVIDEOS: గోదారికి దారేది.. ఎక్కడ చూసినా ట్రాఫిక్ జామ్

Posted: 07/18/2015 03:01 PM IST
Heavy traffic jam on high ways in telugu states

అసలే రెండు రోజులు సెలవులు.. అందునా పవిత్ర గోదావరి మహా పుష్కరాలు.. మరి ఇంకే అందరు ఒక్కసారిగా గోదావరి మహా పుష్కరాలకు బయలుదేరడంతో ట్రాఫిక్ జామ్ అయింది. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అన్ని హైవేల పరిస్థితి దాదాపు ఇలానే ఉంది. గోదావరి పుష్కరాలకు వెళ్లేందుకు లక్షల సంఖ్యలో వెహికిల్స్ హైవే మీద క్యు కట్టాయి. దాంతో హైవేలన్నీ వాహనాలతో రద్దీగా మారాయి. అయితే హైదరాబాద్ చుట్టుపక్కల రహదారులు వాహనాలతో నిండిపోయాయి. ట్రాఫిక్ ను క్లీయర్ చేసేందుకు అధికారులు ఎంత ప్రయత్నం చేస్తున్నా.. పెద్దగా ఫలితం రావడం లేదు. లక్షల సంఖ్యలో వెహికిల్స్ ఒక్కసారిగా రోడ్డెక్కడంతో ట్రాఫిక్ కష్టాలు వచ్చిపడ్డాయి.

Also Read:  ఏంటి లైన్ క్లీయర్ గా ఉందా..? అంతా ఓకేనా..? అంటున్న కేసీఆర్

తెలంగాణ సిఎం కేసీఆర్ పుష్కరాల మీద సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ పరిసరాలతో పాటుగా అన్ని హైవేల మీద పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మెదక్ లో తీవ్రంగా ఉన్న ట్రాఫిక్ జామ్ మీద కేసీఆర్ స్పందించారు. అవసరమైతే జిల్లాలో ఉన్న పోలీస్ లను వాడుకొని ట్రాఫిక్ ను క్లీయర్ చెయ్యాలని ఆదేశించారు. గోదావరి మహా పుష్కరాలు ప్రారంభమై నాలుగు రోజులు గడిచినా భక్తుల రద్దీ మాత్రం తగ్గలేదు. అయితే నాలుగు రోజుల రద్దీ కన్నా ఈ రెండు రోజులు మరింత తాకిడి పెరగనుంది. ముఖ్యంగా భద్రాచలం, ధర్మపురి, బాసర లాంటి పుణ్యక్షేత్రాల్లో రద్దీ విపరీతంగా ఉంది.

Also Read:  ఏపిలో ఎత్తేశారు.. కానీ తెలంగాణలో మాత్రం బాదుతున్నారు

ఇక ఏపిలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. తూర్పు గోదావరి జిల్లాల్లో హైవేలన్నీ బ్లాక్ అయ్యాయి. ఎక్కడ చూసినా పుష్కరాలకు వెళ్లే భక్తులతో వాహనాలు ట్రాఫిక్ జామ్ లో చిక్కుకున్నాయి. ట్రాపిక్ ను ఎంతలా క్లీయర్ చేయాలని ప్రయత్నిస్తున్నా అంతకంతకూ రద్దీ పెరుగుతోంది. రాజమండ్రి, కొవ్వూరు లాంటి ప్రదేశాలకు వాహనాల సంఖ్య లక్షల్లో ఉంది. దాంతో పరిస్థితి మీద ఏపి సిఎం చంద్రబాబు నాయుడు సమీక్ష సమావేశం నిర్వహించారు. భక్తులు సంయమనం పాటించాలని సూచించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం పూర్తి ఏర్పాట్లు చేసినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు.

By Abhinavachary

Also Read:  మా తల్లి గోదారి పిలుస్తోంది.. పుష్కరాలొచ్చె సంబరాలు తెచ్చె

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Godavari Pushkaralu  Telangana  AP  KCR  Chandrababu naidu  Traffic jam  

Other Articles