AAP MLA Ved Prakash shot at in Delhi

Shots fired at aap legislator s office none hurt

AAP MLA Ved Prakash shot at in Delhi, Shots fired at AAP legislator's office, none hurt, AAP MLA shot at, AAP MLA, Ved Prakash, Bawana, Kailash Gehlot, AAP, Aam Aadmi Party, Breaking news, general, politics, sport, entertainment, lifestyle, weird, world, India, news, entertainment news

Aam Aadmi Party MLA from Bawana Ved Prakash escaped unhurt when unidentified miscreants opened fired at him early on Friday, police said

ఆప్ ఎమ్మెల్యే వేద్ ప్రకాష్ పై కాల్పులు.. ఢిల్లీలో కలకలం..

Posted: 07/17/2015 07:12 PM IST
Shots fired at aap legislator s office none hurt

దేశ రాజధాని ఢిల్లీ నగరంలో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యే వేద్ ప్రకాశ్ లక్ష్యంగా కాల్పులు జరిగాయన్న వార్తలు కలకలం రేపాయి. ఆమ్ ఆద్మీ పార్టీ శాసన సభ్యుడిపై కాల్పులు జరిపి హత్య చెయ్యడానికి ప్రయత్నించిన సంఘటన న్యూఢిల్లీలో ఎమ్మెల్యే కార్యాలయం సమీపంలోనే జరిగడం సంచలనం రేపింది. అధికార పార్టీకి చెందిన శాసన సభ్యుడు వేద్ ప్రకాష్ పై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారని పోలీసు అధికారులు తెలిపారు. వేద్ ప్రకాష్ కు ఈశ్వర్ కాలనీలో ఒక కార్యాలయం ఉంది.

గురువారం రాత్రి వేద్ ప్రకాష్ తన కార్యాలయంలో ఉన్నారు. అర్దరాత్రి దాటిన తరువాత ఒంటి గంట సమయంలో వాహనంలో వచ్చిన దుండగులు వేద్ ప్రకాష్ కార్యాలయంపై తుపాకులతో కాల్పులు జరిపారు. తరువాత నిందితులు అక్కడి నుండి పరారైనారు. ఈ కాల్పుల ఘటనలో ఎమ్మెల్యే వేద్ ప్రకాష్ దాడి తృటిలో తప్పించుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. దుండగులు జరిపిన కాల్పులలో ఎవ్వరు గాయపడలేదని పోలీసులు చెప్పారు. రాజకీయ కక్షల కారణంగా దాడి జరిగిందా, వేరే కారణాలు ఉన్నాయా అని పోలీసు అధికారులు ఆరా తీస్తున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : AAP MLA  shot at  AAP MLA  Ved Prakash Bawana  

Other Articles