Revanth Reddy Bail may be confirmed by justice raja ilango on tuesday | cash for vote controversy

Revanth reddy bail may be confirmed by justice raja ilango in cash for vote controversy

revanth reddy news, revanth reddy bail, revanth reddy vote for cash, cash for vote news, revanth reddy updates, revanth reddy controversy, hyderabad high court, acb court

Revanth Reddy Bail may be confirmed by justice raja ilango in cash for vote controversy : According to the speech of justice raja ilango.. Revanth reddy may got his bail

రేవంత్ రెడ్డికి దాదాపు బెయిల్ వచ్చే అవకాశం!

Posted: 06/27/2015 10:26 AM IST
Revanth reddy bail may be confirmed by justice raja ilango in cash for vote controversy

‘ఓటుకు నోటు’ కేసులో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడి జైల్లో శిక్ష అనుభవిస్తున్న టీ-టీడీపీ ఎమ్మెల్యేకి దాదాపు బెయిల్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందుకు ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టు జస్టిస్ రాజాఇళంగో చేసిన వ్యాఖ్యలే బలం చేకూరుస్తున్నాయి. ఈ కేసులో భాగంగా శుక్రవారం హైకోర్టులో జరిగిన వాడీవేడీ వాదనల అనంతరం జస్టిస్ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో మంగళవారం వెలువడే తీర్పులో రేవంత్ కి బెయిల్ వచ్చే సూచనలున్నాయని వార్తలొస్తున్నాయి.

ఈ కేసు విచారణలో భాగంగా రేవంత్ తరఫున సీనియర్ లాయర్ సిద్ధార్థ్ లూత్రా, ఏసీబీ తరఫున అడ్వొకేట్ జనరల్ రామకృష్ణారెడ్డిలు తమ వాదనలు వినిపించారు. దాదాపు గంటపాటు జరిగిన ఈ వాదనల్లో భాగంగా రేవంత్ కి బెయిల్ ఇవ్వొద్దని ఏసీబీ వాదించింది. ఒకవేళ ఇస్తే కేసు తారుమారవుతుందని పేర్కొంది. అటు రేవంత్ తరఫున న్యాయవాది వెయిల్ ఇవ్వాల్సిందేనంటూ వాదించారు. వారిద్దరి వాదనలను సావధానంగా విన్న జస్టిస్ రాజాఇళంగో.. కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

నిందితుడు రేవంత్ కి బెయిల్ ఇవ్వరాదని వాదిస్తూ ఏసీబీ చూపుతున్న కారణాల్లో మొత్తం ఏడు అంశాలున్నాయని జస్టిస్ పేర్కొన్నారు. అయితే.. ఆ ఏడింటిలో కేవలం రెండు అంశాలే హేతుబద్దంగా వున్నాయని.. మిగిలిన ఐదు కారణాలకు ఏమాత్రం హేతుబద్ధత లేదని వ్యాఖ్యానించారు. అలాగే ఫోరెన్సిక్ ల్యాబ్ అందలేదనో, కాల్ డేటా కారణాలతోనో బెయిల్ నిరాకరించలేమన్నారు. నిందితులు పారిపోతారనడానికి తగిన ఆధారాలు లేవన్నారు.

ఇక ‘కేసు డైరీ’ని పరిశీలించిన జస్టిస్.. సీ.ఆర్.పీ.సీ సెక్షన్ 41 ప్రకారం నిందుతుల అరెస్టుకు గల కారణాలను నమోదు చేయలేదని ఏసీబీ తరఫు న్యాయవాదిని ప్రశ్నించారు. ఏడేళ్లవరకు శిక్షపడే అవకాశమున్న కేసుల్లో.. అరెస్టుకు గల కారణాలు నమోదు చేయాల్సిన అవసరం వుందన్నారు. ఈ విధంగా జస్టిస్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో.. మంగళవారం ఆయనిచ్చే తీర్పులో రేవంత్ రెడ్డికి బెయిల్ మంజూరు చేస్తారన్న వాదన వినిపిస్తోంది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : revanth reddy  hyderabad court  cash for vote  revanth bail  

Other Articles