hyderabad street fight convicts in media presence

Hyderabad street fight shows parents negligence police

Street fighting turns ugly in Hyderabad, kills teen, Mirchowk, Hyderabad, street fighting, boxing bout, old city, Hyderabad, teen dies after continous blows on head and face, Crime, wwf, crime in telangana, crime in hyderabad, sabil, old city boxing video goes viral, nabil father yousuf, nabil parents alleges their son nabil its a cold blooded murder, Dcp satya narayana

Nabeel pals threatened his dad Yousuf for going to cops, and now doubts araise in Street fighting: murder

నబీల్ హత్యకు ప్రేమ కాదు.. గ్రూపు తగాదాలే కారణం..

Posted: 05/14/2015 09:06 PM IST
Hyderabad street fight shows parents negligence police

తల్లిదండ్రుల బాధ్యతారాహిత్యం, నిర్లక్ష్యం, యువకుల మధ్య ఎచ్చులు, బడాయిల వల్లే నబీల్ మహ్మద్ హత్యకు కారణమయ్యాయని డీసీపీ వి. సత్యనారాయణ తెలిపారు. ఎదిగిన యువకులు ఎలా మసలుకుంటున్నారో చూసే తీరిక లేకపోతే.. పిల్లలు చెడుమార్గాల పట్ల తొందరగా ఆసక్తి కనబరుస్తారని చెప్పారు. గ్యాంగులు, గ్యాంగుల మధ్య విబేధాలు, మిత్రుల మధ్య బేధాలు ఈ దారుణానికి కారణమయ్యాయని చెప్పారు. పాతబస్తీ మీర్ చౌక్ కు చెందిన నబీల్ అహ్మద్ స్ట్రీట్ ఫైట్లో ప్రత్యర్థి పిడుగుద్దులకు మృతి చెందిన కేసులో నిందితులను...ఇవాళ మీడియా ముందు ప్రవేశపెట్టారు. వారి వద్ద నుంచి 9 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

ఈ కేసుకు సంబంధించిన వివరాలను డీసీపీ గురువారం మీడియా సమావేశంలో వివరించారు. బడాయి మాటలు, ఎచ్చులతో యువకులు సైటెర్లు వేసుకుని... ఒకరిపై ఒకరు ఆధిపత్యం చూపించుకునేలా ప్రవర్తించడం.. అది కాస్తా ముదిరి స్ట్రీట్ ఫైట్కు దారి తీసినట్లు చెప్పారు. అలాగే యువకుల తల్లిదండ్రులకు పిల్లల్ని గారాభం చేయటం, వారిని పట్టించుకోకపోవటం జరిగిందన్నారు. స్ట్రీట్ఫైట్లో నబీల్ మహ్మద్ మృతి చెందగా, స్నేహితులు ఆ విషయాన్ని దాచిపెట్టి సాక్ష్యాలను తారుమారు చేసినట్లు చెప్పారు.

అయితే వైద్యుల నివేదికలో తలకు బలమైన దెబ్బలు తగలడం వల్లే నబీల్ మృతి చెందినట్లు నివేదిక రావటంతో తాము అన్ని కోణాల్లో విచారణ జరిపినట్లు డీసీపీ వెల్లడించారు. అలాగే సోషల్ మీడియాలో వచ్చిన వీడియోను కూడా తమ సిబ్బంది పరిశీలించి, విచారణ జరపడంతో అసలు విషయం బయటపడిందన్నారు. నబీల్ తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు తొమ్మిదిమందిపై కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. వారిలో ఇద్దరు మైనర్లు కూడా ఉన్నారు. వీరందర్ని కోర్టుకు హాజరు పరచనున్నట్లు చెప్పారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : hyderabad  telangana  street fight  murder  

Other Articles