Jayalalitha | Supreme court | Karunanidhi | Vijaykanth

Anna dmk party president and dmdk chief may go to supreme court on jayalalitha release

Jayalalitha, Supreme court, Karunanidhi, Vijaykanth

anna dmk party president and dmdk chief may go to supreme court on jayalalitha release. Jayalalitha and her party leaders are fearing about the appeal.

జయలలితకు.. ముందుందా ముసళ్ల పండగ..?!

Posted: 05/13/2015 08:04 AM IST
Anna dmk party president and dmdk chief may go to supreme court on jayalalitha release

త‌మిళ‌నాడు మాజీ ముఖ్యమంత్రి అన్నాడిఎంకె అధినేత్రి జ‌య‌ల‌లిత అక్రమాస్తుల కేసులో క‌ర్ణాట‌క హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో అప్పీలు చేయ‌డానికి డిఎంకె స‌హా ఇత‌ర ప్రతిప‌క్ష పార్టీలు సిద్ధమ‌య్యాయి. క‌ర్ణాట‌క హైకోర్టు జ‌య‌ల‌లిత‌ను నిర్దోషిగా ప్రక‌టించ‌డాన్ని జీర్ణించుకోలేని పార్టీలు దీన్ని స‌వాల్ చేస్తూ సుప్రీంకోర్టులో అప్పీలు చేయాల‌ని త‌మిళ రాజ‌కీయ పార్టీలు క‌ర్ణాట‌క రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరాయి. జ‌య‌ల‌లిత అక్రమాస్తులపై సుప్రీంలో అప్పీలు వేయాల‌ని డిఎంకె చీఫ్ క‌రుణానిధి కూడా క‌ర్ణాట‌క ప్రభుత్వాన్ని కోరారు. హైకోర్టు ఇచ్చిన తీర్పును తాను ఊహించ‌లేక‌పోయాన‌ని డిఎండికె చీఫ్ విజ‌య‌కాంత్ తెలిపారు.

కేసుల చిక్కుముడి వీడిపోయింది, ఇక అమ్మ ముఖ్యమంత్రి కావడమే తరువాయి అని భావిస్తున్న తరుణంలో అనుమానాలు తలెత్తుతున్నాయి. తాజా తీర్పుపై స్టే విధించాలని, అప్పీలు చేయాలని విపక్షాల నుంచి ఒత్తిళ్లు పెరుగుతున్న తరుణంలో జయలలిత సీఎం అయ్యేనా అని అనుమానిస్తున్నారు. కోర్టు తీర్పు తమకు వ్యతిరేకంగా వచ్చిందని భావించనవారు అప్పీలుకు పోవడం న్యాయవ్యవస్థలో సహజం. కర్ణాటక ప్రత్యేక కోర్టు జయకు జైలు శిక్ష విధించినపుడు హైకోర్టులో అప్పీలు చేసుకుని నిర్దోషిగా బైటపడ్డారు. ఇపుడు అప్పీలు వ్యవహారం విపక్షాల వంతుకు వచ్చింది. జయ నిర్దోషిగా బైటపడితే తమకు రాజకీయ భవిష్యత్తు ఉండదని భావిస్తున్న పార్టీలన్నీ అప్పీలు కోసం పట్టుపడుతున్నాయి. ఈ తరుణంలో తొందరపడి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టరాదని జయ వెనకడుగు వేస్తున్నట్లు సమాచారం. తాజా తీర్పు వెలువడి రెండురోజులు గడిచినా అన్నాడీఎంకే నుంచి ఇంతవరకు ఒక్క అధికారిక ప్రకటన వెలువడక పోవడం వెనుక అప్పీలుపై ఆందోళనే కారణమని అంటున్నారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jayalalitha  Supreme court  Karunanidhi  Vijaykanth  

Other Articles