Supremecourt | Jayalalitha | Case | Tamilnadu | karnataka

Supreme court order to reveal judgement on jayalalitha case

supreme court, karnata, tamil nadu, jayalalitha, assets, public procecuter,

Supreme court order to reveal judgement on Jayalalitha case. Tamilnadu former cm jayalalitha case, dmk oppose the public procecuter appointment. But the Supreme court order to karnata high court to reveal the judgement.

అంతా అయిపోయిందిగా.. తీర్పివ్వండి: సుప్రీంకోర్ట్

Posted: 04/27/2015 01:29 PM IST
Supreme court order to reveal judgement on jayalalitha case

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత కేసు కీలక ములపులు తిరుగుతోంది. అక్రమాస్తులను కలిగి ఉన్నారన్న జయలలిత కేసు తీర్పు ఇవ్వకుండా కర్ణాటక హైకోర్టుపై విధించిన స్టేను సుప్రీంకోర్టు ఎత్తివేసింది. ఇప్పటికే వాదనలు విన్నామని.. కొత్తగా వాదనలు వినాల్సిన అవసరం లేదని కోర్టు స్పష్టం చేసింది.  గతంలో చేసిన వాదనల ఆధారంగా తుది తీర్పును ఇవ్వొచ్చని సుప్రీంకోర్ట్  స్పష్టం చేసింది. దీంతోపాటు ఈ కేసు విషయంలో ప్రత్యేక పబ్లిక్ ప్రాసీక్యూటర్ను నియమించే అధికారం తమిళనాడు ప్రభుత్వానికి లేదని కూడా సుప్రీంకోర్ట్ వెల్లడించింది. ఒకవేళ నియమించినా ఆయన ద్వారా కర్ణాటక హైకోర్టులో ఈ కేసుపై తాజాగా వాదనలు చేయాల్సిన అవసరం లేదని అత్యున్నత న్యాయస్థానం తెలిపింది. భవానీ సింగ్ అనే వ్యక్తిని ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నియమించడాన్ని వ్యతిరేకిస్తూ డీఎంకే నేత ఒకరు కోర్టుకు వెళ్లడంతో దానిపై గతంలో నిర్ణయాన్ని ప్రకటించిన కోర్టు తాజాగా తుది నిర్ణయాన్ని వెలువరించింది.

జయలలిత కేసులో చాలా కాలంగా జాప్య జరుగుతూ వస్తోంది. పబ్లిక్ ప్రాజిక్యూటర్ నియామకంపై తమిళనాట పెద్ద వివాదమే చెలరేగింది. అసలు ఈ కేసులో జరుగుతున్న వ్యవహారాలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసులో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే కేసును మరింత జాప్యం చేయాలని చూస్తున్నట్లుగా ఉందన్న అనుమానం కూడా కోర్టు వ్యక్తం చేసింది. తమ ఆదేశాలు అందిన వెంటనే ఈ కేసులో ముందుకు వెళ్లాలని కూడా సుప్రీంకోర్టు కర్ణాటక హైకోర్టుకు చెప్పింది. చట్టంలో ప్రత్యేక పబ్లిక్ ప్రాసీక్యూటర్ అనే వ్యవస్థ సరైనది కాదని కోర్టు ఈ సందర్భంగా తప్పుబట్టింది. మొత్తానికి తమిళనాట, జయలలిత అనుకూల వర్గానికి కాస్త దెబ్బతగిలింది. మరి సుప్రీంకోర్టు తీర్పుతో డిఎంకే నాయకులు ఎలా స్పందిస్తారో చూడాలి. సుప్రీంకోర్టు తీర్పుపై రివ్యూ పిటిషన్ వేస్తారా అన్నది తొందరలోనే తేలుతుంది.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : supreme court  karnata  tamil nadu  jayalalitha  assets  public procecuter  

Other Articles