TANA | Elections | Satish vemana | President

Satish vemana elected as tana president in the recent elections

satish vemana, tana, elections, madhu thatha, convenor, america, telugu union

Satish vemana elected as TANA president in the recent elections. satish vemana as TANA president, madhu thatha as convenor, murali mannem won as treasurer.

తానా అధ్యక్షుడి గా సతీష్ వేమన.. విజేతలు వీరే

Posted: 04/27/2015 09:51 AM IST
Satish vemana elected as tana president in the recent elections

ప్రవాస భారతంలో అతి పెద్ద తెలుగు వారి సంఘం ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఎన్నికలలో సతీష్ వేమన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అధ్యక్ష పదవికి పోటీ చేసిన సతీష్‌ వేమన తన ప్రత్యర్థి రామ్‌ యలమంచిలిపై 5120 ఓట్ల తేడాలో భారీ విజయాన్ని సాధించారు. సతీష్‌కు 8257 ఓట్లు రాగా, రామ్‌కు 3137 ఓట్లు వచ్చాయి. ఓట్ల లెక్కింపులో మొదటి నుంచి సతీష్‌ వేమన ఆధిక్యాన్ని కనబరిచారు. వేమన ప్యానెల్‌లో ఉన్న మధు తాతా, మురళీవెన్నం, రవి పొట్లూరి కూడా భారీ మెజారిటీతో విజయాన్ని సాధించారు. ఎన్నికల ఫలితాలను తానా ఎన్నికల కమిటీ అధ్యక్షుడు పాపారావు గుండవరం ప్రకటించారు.

తానా ఫౌండేషన్ ట్రస్టీలుగా నలుగురు అభ్యర్ధులను ఎన్నుకున్నారు. వీరిలో వేమన ప్యానెల్ నుండి కోయా రమాకాంత్, వీరపనేని అనిల్, లావు శ్రీనిలు గెలుపొందగా, కెనడా నుండి లింగమనేని అనిల్ గెలుపొందారు జూలైలో డిట్రాయిట్‌లో జరిగే తానా 20వ మహాసభల్లో ప్రస్తుత అధ్యక్షుడు మోహన్‌ నన్నపనేని నుంచి అధ్యక్ష బాధ్యతలను డాక్టర్‌ చౌదరి జంపాల స్వీకరిస్తారు. అదే వేదికపై 2015-17 కాలానికిగాను కార్యనిర్వాహక ఉపాధ్యక్షునిగా సతీష్‌ వేమన బాధ్యతలను చేపట్టనున్నారు. ఆయనతోపాటు ఇతర కార్యవర్గ సభ్యులు కూడా పదవి స్వీకారం చేస్తారు పదిహేనేళ్లుగా తానాలో సభ్యుడిగా యాక్టివ్ గా ఉంటున్న సతీష్ రెండేళ్ల తర్వాత తానా అద్యక్షుడు అవుతారు.

అధ్యక్షుడు - సతీష్ వేమన
ఫౌండేషన్ ట్రస్టీలు - రమాకాంత్ కోయ, శ్రీనివాస్ లావు, అనిల్ లింగమనేని, అనిల్ కుమార్ వీరపనేని
కార్యదర్శి -  మధు తాతా
కోశాధికారి - మురళీ యెన్నం,
జాయింట్ సెక్రటరి - రవి పొట్లూరి

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : satish vemana  tana  elections  madhu thatha  convenor  america  telugu union  

Other Articles