Soniagandhi | Rahulgandhi | Speech | Parliament | Congress

Sonia gandhi happy on rahul gandhi speech at parliament after retuned to india

sonia gandhi, rahul gandhi, congress, president, aicc, speech, parliament, nda

Sonia gandhi happy on rahul gandhi speech at parliament after retuned to india. Congress president sonia gandhi clear that rahul will decide on congress president position.

సుర్రు సూపరూ.. రాహుల్ స్పీచ్ పై సోనియాగాంధీ ఆనందం

Posted: 04/21/2015 09:47 AM IST
Sonia gandhi happy on rahul gandhi speech at parliament after retuned to india

లోక్‌స‌భ‌ లో కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రసంగంపై కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ సంతోషం వ్యక్తం చేశారు. భూసేకరణ బిల్లుపై చర్చ సందర్భంగా రాహుల్ బాగా మాట్లాడారని ఆమె కొనియాడారు. రైతు సమస్యలపై తాము పోరాడుతూనే ఉంటామని స్పష్టం చేశారు. అయితే ‘రాహుల్‌ గాంధీ కాంగ్రెస్‌ అధ్యక్ష బాధ్యతలు చేపడతారా? అయితే, ఎప్పుడు?’ ఇదే ప్రశ్నను పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీని అడగ్గా... ‘దీనికి రాహులే జవాబివ్వాలి’ అన్నారు. వెరసి... ఆయన కోరగానే కిరీటం పెట్టేస్తామని చెప్పకనే చెప్పారు. సోమవారం పార్లమెంటులో రైతు సమస్యలపై రాహుల్‌ చెలరేగిపోగా ఆ సమయంలో సోనియా సభలో లేరు. రాహుల్‌ ప్రసంగం ముగిశాక ఆమె మీడియాతో మాట్లాడారు. సభలో రాహుల్‌ ప్రసంగంపై స్పందన కోరగా- ‘నేను పూర్తిగా వినలేకపోయాను. అయితే, బాగా మాట్లాడారని మా వాళ్లు చెప్పారు. బాగా మాట్లాడతాడని నాకు తెలుసు. రాహుల్‌పై నాకు ఆదినుంచీ నమ్మకముంది’’ అని కుమారుడికి కితాబు ఇచ్చారు. బడ్జెట్‌ సమావేశాల్లో రాహుల్‌ తొలిసారి ప్రసంగించగా రైతులతో, నేతలతో భేటీకోసం సోనియా బయటికి వెళ్లిపోయారు. పార్టీ ఉప నేత అమరీందర్‌సింగ్‌, కమల్‌నాథ్‌ వంటి సీనియర్లూ కనిపించలేదు. కాంగ్రెస్ కు అంతా కలిపి 44 మంది ఎంపీలు ఉండగా, వారిలో 15 మంది రాహుల్‌ ప్రసంగానికి ‘మిస్‌’ కొట్టారు. అచ్చేదిన్ సర్కార్ అట్టర్ ప్లాఫ్ అయిందని రాహుల్ వ్యాఖ్యానించారు. మోడీ సర్కార్ సూటుబూటు సర్కార్ అని ఎద్దెవా చేశారు. బడాబాబులకు కొమ్ము కాస్తూ రైతులను పట్టించుకోవడం లేదని రాహుల్ మాట్లాడారు. మొత్తానికి రాహుల్ తిరిగి వచ్చిన తర్వాత జరిగిన మొదటి పార్లమెంట్ సమావేశాల్లో అదరగొట్టారు. మరి కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపడటాడో లేదో.. ఒకవేళ చేపట్టినా అధ్యక్షుడిగా అదరగొడతాడో లేదో చూడాల్సిందే.

**అభినవచారి**

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sonia gandhi  rahul gandhi  congress  president  aicc  speech  parliament  nda  

Other Articles