yuvraj singh | zaheer khan | India Cricket team | Ipl New Season

Yuvraj singh zaheer khan eager to reentry in india cricket team

yuvraj singh, zaheer khan, yuvraj singh interview, zaheer khan interview, yuvraj singh latest updates, zaheer khan latest updates, delhi dare devils teams, delhi dare devils updates, yuvraj singh press meet, yuvraj singh gallery, ipl season news, ipl latest season, ipl news, ipl controversies

yuvraj singh zaheer khan eager to reentry in india cricket team : The Senior cricketers yuvraj singh and zaheer khan expressing their confidience that both they will give best performace in this ipl season and will get chance to re enter in india cricket team.

టీమిండియాలో చోటుకోసం ఐపీఎల్ ని నమ్ముకున్న క్రికెటర్లు

Posted: 03/31/2015 08:51 PM IST
Yuvraj singh zaheer khan eager to reentry in india cricket team

డ్యాషింగ్ క్రికెటర్ యువరాజ్ సింగ్, పేసర్ జహీర్ ఖాన్ టీమిండియాలో చోటు కోల్పోయిన విషయం తెలిసిందే! గాయాల కారణంగా జహీర్ దూరం కాగా... జట్టు వ్యూహాలకు సరిపోడంటూ యువీని జట్టు నుంచి తీసేసి పక్కకు పెట్టేశారు. అయితే.. యువీని ఈ విధంగా పక్కనపెట్టడంపై ధోనీ అప్పట్లో ఎన్నో విమర్శలు ఎదుర్కోవలసి వచ్చింది. అంతేకాదు.. ఇటీవలే జరిగిన వరల్డ్ కప్ టీమిండియా ఓడిపోగా అప్పుడు కూడా యువీ అంశం తెరమీదికొచ్చింది. జడేజా లేదా ఇతర ఏ ఆటగాడి స్థానంలోనైనా యువీని తీసుకుని వుండుంటే.. రిజల్ట్ మరోలా వుండేదని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అయితే.. టీమిండియా యాజమాన్యం దాన్నెలాగో సమర్థించుకుందిలెండి!

ఇదిలావుండగా.. యువీ, జహీర్ తిరిగి టీమిండియాలో స్థానం దక్కించుకోవడం కోసం తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న ఐపీఎల్ పోటీల్లో తమ సత్తా చాటుకుని భారత్ జట్టులో స్థానం మళ్లీ ఎంట్రీ ఇవ్వాలని ఇద్దరూ పట్టుదలతో వున్నారు. ఐపీఎల్ మీద తమ భవితవ్యం ఆధారపడి వుందన్న అభిప్రాయాన్ని ఇద్దరూ వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే యువీ మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం అనారోగ్యం నుంచి కోలుకొని ఫిట్ గానే వున్నా. ఈ రెండేళ్లు నాకు ఎంతో కష్టంగా గడిచాయి. దేశవాళీల్లో రాణించి ఆత్మవిశ్వాసంతో వున్నా. ఐపీఎల్ లో బాగానే రాణించగలని నాకు నమ్మకం వుంది. ఈసారి జట్టులో తిరిగి స్థానం కల్పించుకోవడం కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తాను’ అంటూ తెలిపాడు.

ఇక జహీర్ ఖాన్ మాట్లాడుతూ.. ‘కొంతకాలం నుంచి క్రికెట్ ని దూరమయ్యాను. మళ్లీ టీమిండియాలో వచ్చేందుకు తొలి అడుగు ఐపీఎల్ ద్వారా వేస్తున్నాను. ఈ టోర్నీలో నేను బాగానే రాణించగలనని ఆత్మవిశ్వాసంతో వున్నా’ అని నమ్మకం వ్యక్తం చేశాడు. అన్నట్లు.. యువీ, జహీర్ ఈ ఐపీఎల్ సీజన్ లో ఢిల్లీ డేర్ డెవిల్స్ తరఫున ఆడుతున్నారు. వీరిలో యువీ రూ.16 కోట్లకు అత్యధిక ధర పలికిన విషయం విదితమే! మరి.. వీరిద్దరి ఈ సీజన్ లో ఏ విధంగా రాణిస్తారో వేచి చూడాలి!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : yuvraj singh  zaheer khan  ipl new season  india cricket team  

Other Articles