Mrps and unemployees jac call for chalo asembly at telanagana

telanagana, assembly, police, ou, mrps, ncc gate,

mrps and unemployees jac call for chalo asembly at telanagana. telanagana assembly under police protection at hyderabad. some students from osmania university tried to enter assembly police stoped them, and arrested.

ఛలో అసెంబ్లీ.. అసెంబ్లీ పరిసరాల్లో ఉద్రిక్తత

Posted: 03/18/2015 09:12 AM IST
Mrps and unemployees jac call for chalo asembly at telanagana

ఎస్సీ వర్గీకరణ, అమలు చెయ్యాలని ఎమ్మార్పీయస్ , ఉద్యోగ ప్రకటన చెయ్యాలని నిరుద్యోగులు తెలంగాణ అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చింది. దాంతో వేలాదిగా తరలివచ్చిన ఎమ్మార్పియస్ కార్యకర్తలు, నిరుద్యోగులతో హైదరాబాద్ లో కాస్త టెన్షన్ వాతావరణం నెలకొంది. తెలంగాణ సిఎం కెసిఆర్ ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా అసెంబ్లీలొ తీర్మానం చేసినా, అమలుకు మాత్రం నోచుకోవడం లేదు. దాంతో ఎమ్మార్పీయస్ తెలంగాణ ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ అసెంబ్లీ ముట్టడికి సిద్దమైంది. మరో పక్క తెలంగాణ ఏర్పడి ఇంత కాలమైనా కనీసం ఒక్క నోటిఫికేషన్ కూడా రాకపోవడంపై నిరుద్యోగులు మండిపడుతున్నారు. ఓయు నుండి గన్ పార్క్ వరకు నిర్వహించిన నిరసన ర్యాలీని ఎన్.సి.సి గేట్ వద్ద అడ్డుకున్నారు పోలీసులు. మరి నేడు తలపెట్టిన ఛలో అసెంబ్లీ ఎలాంటి ఉద్రిక్తతలకు దారితీస్తుందో అని పోలీసులు టెన్షన్ గా ఉన్నారు.

ఎమ్మార్పీఎస్‌, నిరుద్యోగ జేఏసీ  చేపట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలు కొనసాగుతున్నాయి. పోలీసులు పలు మార్గాల్లో వాహనాలు మళ్లిస్తున్నారు. ఇక్బాల్‌మినార్‌ నుంచి రవీంద్రభారతి వైపు వచ్చే వాహనాలు ఎన్టీఆర్‌ మార్గ్‌ వైపు మళ్లిస్తున్నారు. ఏఆర్‌ పెట్రోల్‌ బంక్‌, పీసీఆర్‌ జంక్షన్‌.. రవీంద్రభారతి వైపు వచ్చే వాహనాలు బీజేఆర్‌ విగ్రహం పైపునకు, బషీర్‌బాగ్‌ నుంచి పీసీఆర్‌ జంక్షన్‌ వైపు వచ్చే వాహనాలు బషీర్‌బాగ్‌ కూడలి నుంచి లిబర్టీ వైపుగా పంపిస్తున్నారు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుండి, నాంపల్లి నుండి అసుంబ్లీకి రాకుండా భారీగా బారికేడ్లను ఏర్పాటు చేశారు పోలీసులు. అయితే ఓయు నుండి ర్యాలీగా బయలుదేరిన కొంత మంది విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు. ఎమ్మార్పియస్ కార్యకర్తలు అసెంబ్లీలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించినా వారిని పోలీసులు అడ్డుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : telanagana  assembly  police  ou  mrps  ncc gate  

Other Articles