Must punished me for that markhandeya katju post in his blog

markahdeyakatju, blog, rajyasabha, gandhi, netaji, jinnah

The Rajya Sabha has passed a resolution condemning me. But of course that is not enough. I must also be punished for what I said about that fake who is called the Father of the Indian Nation, and that agent of the Japanese fascists. A mere censure is no punishment.

అందుకు నన్ను శిక్షించాల్సిందే: మార్ఖండయే కట్జూ

Posted: 03/12/2015 01:21 PM IST
Must punished me for that markhandeya katju post in his blog

మహాత్మా గాంధీ, నేతాజీలపై తాను చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను ఖండిస్తూ రాజ్యసభ ఓ తీర్మానాన్ని చేపట్టడంపై సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి మార్కండేయ కట్జు తీవ్ర స్థాయిలో స్పందించారు. కేవలం తీర్మానం ద్వారా తనను వ్యతిరేకించడం, శిక్ష విధించినట్టు కాదన్నారు. తనను కఠినంగా శిక్షించాలని, ఎలాంటి విచారణ లేకుండా ఉరితీయాలని పేర్కొన్నారు. ‘రాజ్యసభ తీర్మానం నన్ను శిక్షించడం కాదు. గాంధీ, నేతాజీలపై నేను చేసిన వ్యాఖ్యలకు నన్ను శిక్షించాల్సిందే. సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తిగా నాకు ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలనూ తొలగించాలని కొందరు సభ్యులు డిమాండ్ చేశారు. అది అంత సులభం కాదు. అందుకు నియమ నిబంధనలను మార్చాల్సి ఉంటుంది’ అని కట్జు తన బ్లాగ్‌లో పేర్కొన్నారు. తాను భారత్‌కు తిరిగి వచ్చిన వెంటనే అరెస్టు చేసి ఉరితీసేలా తీర్మానాన్ని చేపట్టాలని గౌరవనీయ రాజ్యసభ సభ్యుల్ని కోరుతున్నానని అన్నారు. మహాత్మా గాంధీ బూర్జవా ఆలోచనలను వెలుగులోకి తెచ్చే విధంగా ఉన్న పండిట్ నెహ్రూ స్వీయ చరిత్రలోని కొన్ని వ్యాఖ్యలను కట్జు తాజాగా వెలుగులోకి తెచ్చారు.

kkk

అలా గాంధీ. నేతాజీ, నెహ్రూలనే కాదు అందరిపైనా ఇబ్బందికర వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా మహ్మద్ జిన్నా గురించి కూడా ఓ ఆర్టికల్ రాశారు. మహ్మద్ జిన్నాను పాకిస్థాన్ వారు ఖయిది-ఇ-ఆజం అని పిలుస్తారు. దానికి అర్థం ప్రజల నాయకుడు అని, కానీ జిన్నాను అలా పిలవడానికి అర్హత ఉందా. అసలు అందులో వాస్తవం ఎంత అంటూ తాజాగా మరో ఆర్టికల్ రాయడంపై మరో సంచనానికి తెర తీసింది. మొత్తానికి మార్ఖండేయ ఖట్జూ అందరి మీద ఆరోపణలు చేస్తున్నారు. అయితే తాను మాత్రం ఎవరి మాటలకు భయపడేది లేదు అని చెప్పకనే చెబుతున్నారు.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : markahdeyakatju  blog  rajyasabha  gandhi  netaji  jinnah  

Other Articles