Bjp and pdp forming govt in jammu and kashmir

pdp, bjp pdp, jammu kashmir, kashmir, jammu govt

bjp and pdp forming govt in jammu and kashmir : pdp ready to collabarate with bjp. pdp demands on article 370 and some amindements in kashmir. modi has to take final decition.

జమ్ము కాశ్మీర్ లో సంకీర్ణ ప్రభుత్వం..?

Posted: 02/17/2015 04:15 PM IST
Bjp and pdp forming govt in jammu and kashmir

జమ్మూకాశ్మీర్ రాజకీయాలు రసవత్తరంగా సాగాయి. చాలా సార్లు చర్చల తర్వాత పిడిపి, భాజపా పొత్తు కుదిరినట్లు సమాచారం. అయితే పిడిపి పట్టుబట్టినట్లు 370 ఆర్టికల్ ను కేంద్ర ప్రభుత్వం వెంటనే రద్దు చెయ్యాలని ఓ అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. జమ్ము కాశ్మీర్ లో కేంద్ర బలగాలకు హక్కులను కల్పిస్తున్న చట్టాలను రద్దు చెయ్యాలని, పౌరులకు పూర్తి హక్కులు కల్పించాలని పిడిపి ప్రధానంగా డిమాండ్ చేసింది. అయితే కేంద్ర బలగాల హక్కుల విరమణ గురించి మిలిటరీ అధికారులతో చర్చించి, ఓ నిర్ణయాన్ని తీసుకుంటామని భాజపా తెలిపినట్లు తెలుస్తోంది.

మొత్తానికి జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు కానుంది. ఈ ప్రభుత్వాన్ని పీడీపీ, బీజేపీలు కలిసి ఏర్పాటు చేయనున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుపై జరుగుతున్న చర్చలు ఓ కొలిక్కి వచ్చినట్టు సమాచారం. ఫలితంగా ముఖ్యమంత్రిగా పీడీపీ నేత ముఫ్తీ మహమ్మద్, ఉప ముఖ్యమంత్రిగా బీజేపీ నాయకుడు బాధ్యతలు చేపట్టే అవకాశముంది. దీంతో మరో వారం రోజుల్లో జమ్మూ కాశ్మీర్‌లో ప్రభుత్వం ఏర్పాటుకానుంది. ప్రస్తుతం గవర్నర్ పాలనలోనున్న ఈ రాష్ట్రంలో... ప్రభుత్వ ఏర్పాటుకు పీడీపీ -బీజేపీ సిద్ధమయ్యాయి. జమ్మూకశ్మీర్ పాలన కోసం అనుచరించాల్సిన విధి విధానాలు దాదాపు ఖరారయ్యాయి. దీనిపై ప్రధాని నరేంద్ర మోడీ తుది నిర్ణయం తీసుకోనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pdp  bjp pdp  jammu kashmir  kashmir  jammu govt  

Other Articles