Undavalli arun kumar fires on chandrababu

undavalli arun kumar fires on chandrababu, undavalli arun kumar lashes on chandrababu, only 1 percent of votes had given power to tdp, 1 percent of votes,

undavalli arun kumar lashes on chandrababu and states only 1 percent of votes had given power to tdp

ITEMVIDEOS: లక్కు బాగుండి ఒక్క శాతంతో గద్దెనెక్కావు..

Posted: 02/12/2015 07:17 PM IST
Undavalli arun kumar fires on chandrababu

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడి లక్కు బాగుండి ఒక్క శాతం ఒట్లతో గద్దెనెక్కారని రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సైటర్ విసిరారు. చంద్రబాబు దశ బాగుంది కనుకే ఒక్కశాతం ఓట్లతో ముఖ్యమంత్రి అయ్యారని వ్యాఖ్యానించారు. ఆయన గురువారం ఆంధ్రప్రదేశ్ రాజధాని పరిసర గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా రాజధానికి భూములు ఇవ్వని రైతులతో ఉండవల్లి మాట్లాడారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ల్యాండ్ పూలింగ్ దేశంలో ఎక్కడా వివాదాస్పదం కాలేదని అన్నారు. రాజధానికి భూములు ఇవ్వని రైతులతో మాట్లాడితే భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారన్నారు.

రాజధాని పరిసర గ్రామాల్లోని భూములన్ని 365 రోజులు పంటలు పండే భూములని ఉండవల్లి అన్నారు. రైతులకు ఇష్టం లేకున్నా భూములను తీసుకోవడం సరికాదన్నారు. దిశల పేరుతో రైతుల భూముల్లో రాజధాని కట్టడం సరైంది కాదన్నారు. రైతుల సమస్యలపై పార్లమెంట్లో చర్చ జరిగేలా ప్రయత్నిస్తామని ఉండవల్లి తెలిపారు. అసవరం అయితే న్యాయ పోరాటానికి సన్నద్ధం అవుతామని ఉండవల్లి హెచ్చరించారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : undavalli arun kumar  Chandrababu Naidu  Capital lands  

Other Articles