Barack obama quoted shahrukh khan legendary dialogue dilwale dulhaniya lejayenge

barack obama news, barack obama shahrukh khan, shahrukh khan ddlj dialogue, obama ddlj dialogue, obama shahrukh ddlj dialogue, obama delhi speech, obama sirifort delhi speech, ddlj movie news, shahrukh khan dilwale dulhaniya lejayenge

barack obama quoted shahrukh khan legendary dialogue dilwale dulhaniya lejayenge

ITEMVIDEOS: బరాక్ నోటినుంచి షారుఖ్ ఖాన్ డైలాగ్...

Posted: 01/27/2015 03:53 PM IST
Barack obama quoted shahrukh khan legendary dialogue dilwale dulhaniya lejayenge

గణతంత్ర వేడుకల సందర్భంగా ముఖ్యఅతిథిగా ఒబామా దంపతులు భారతదేశానికి విచ్చేసిన సంగతి తెలిసిందే! ఈ పర్యటనలో భాగంగా చివరిరోజు ఢిల్లీలోని సిరిఫోర్ట్ ఆడిటోరియంలో అమెరికా అధ్యక్షుడు ప్రసంగించారు. ఈ నేపథ్యంలో ఆయన ఆ ఆడిటోరియంలో వున్న యూనివర్శిటీ విద్యార్థులు, సామాజికవేత్తలతో మరింతగా కనెక్ట్ అయ్యేందుకు బాలీవుడ్ మార్గాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. అందుకే.. ఆయన తన ప్రసంగంలో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ సినిమాలోని ఓ డైలాగ్’ని ఉపయోగించినట్లు తెలుస్తోంది.

స్టేజ్ మీదకి విచ్చేసిన అనంతరం తన ప్రసంగాన్ని మొదలుపెట్టిన ఒబామా.. తొలి నాలుగు నిముషాల్లో షారుఖ్ ఖాన్ నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం ‘దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే’ చిత్రంలోని పాపులర్ డైలాగ్’ను ప్రస్తావించారు. ఈ ప్రసంగం నేపథ్యంలో మొదట ‘నమస్తే, ధన్యవాద్’ అంటూ మాట్లాడిన ఆయన... గతంలో తాను పర్యటనకు వచ్చినప్పుడు ముంబైలో భాంగ్రా డ్యాన్స్ చేశానని తెలిపిన ఆయన.. అతని ప్రెసిడెన్సీ అధికారంలో ఈ విధంగా నృత్యం చేయడం అదే మొట్టమొదటిసారి అని పేర్కొన్నారు.

అలాగే సెలెబ్రేషన్స్ ఆఫ్ ముంబైలో చిన్నపిల్లలతో కలిసి డ్యాన్స్ చేశానని చెప్పిన ఆయన.. ఈసారి అలా కుదరలేదని తెలిపారు. ఇలా అన్న తర్వాత ఆయనే.. ‘‘సెనోరిటా... బడే బడే దేశో మేఁ.. ఇక నేను చెప్పదలచుకున్నది మీకు తెలిసే వుంటుంది’’ అంటూ షారుఖ్ ఖాన్ మూవీ డైలాగ్’ను ప్రస్తావించారు. ఈ డైలాగ్ అన్న తర్వాత ఆ ఆడిటోరియంలో వున్నవారందరూ జోరుగా చప్పట్లు కొట్టారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : barack obama shahrukh khan  obama ddlj dialogue  obama delhi speech  

Other Articles