Tirumala venkateswara temple laddu prasadam duplicate xerox tokens

tirumala laddu prasadam, tirumala laddu making recipe, tirumala laddu prasadam specialties, tirumala laddu duplicate tokes, tirumala tirupati devasthanam tickets booking, tirumala tirupati train bus tickets reservation tirumala latest update

tirumala venkateswara temple laddu prasadam duplicate xerox tokens : lord venkateswara faces duplication problems in laddu prasadam some of devotees gives xerox copies of laddu prasadam tokens to ttd counters and getting laddus vigilance officers seized tokens and arrested responsible persons

తిరుమల శ్రీనివాసుడికే పంగనామాలు పెడుతున్నారే

Posted: 12/23/2014 07:50 AM IST
Tirumala venkateswara temple laddu prasadam duplicate xerox tokens

తిరుమల శ్రీనివాసుడికి నుదుటన వైష్ణవ తిలకం ఉంటుంది. దీన్నే వ్యగ్యంగా పంగనామాలు అని అనుకుంటారు..., కొందరు భక్తులు ఇప్పుడు శ్రీనివాసుడికే పంగనామాలు పెడుతున్నారు. మహా ప్రసాదంగా భావించే తిరుమల లడ్డూను అందరికి అందకుండా దోచేస్తున్నారు. మంగళవారం ఉదయం వెలుగులోకి వచ్చిన ఈ ఘటనతో కొత్త విషయం బయటకు వచ్చింది. లడ్డూలను ఇంత సింపుల్ గా అక్రమ మార్గంలో తీసుకెళ్తున్నారా అని విజిలెన్స్ అధికారులు సైతం అవాక్కవుతున్నారు.

తిరుమల శ్రీనివాసుడి లడ్డూకు ఉన్న విశిష్టత తెలియనిది కాదు. మహా ప్రసాదంగా భావించే ఈ లడ్డూ కోసం భక్తులు పోటి పడుతుంటారు. డిమాండ్ వల్ల.., లడ్డూలను భక్తులకు పరిమిత సంఖ్యలో అందిస్తోంది. అయితే అధిక లడ్డూలకు ఆశపడుతున్న కొందరు భక్తులు., లడ్డూ టోకెన్లను కలర్ జిరాక్స్ తీయించి కౌంటర్ లో ఇస్తున్నారు. బాగా రద్దీ ఉన్న సమయంలో భక్తుల మద్యలో చేరిపోయి నకిలి టోకెన్లు ఇచ్చి లడ్డూలు తీసుకుంటున్నారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటం వల్ల టోకెన్లు అసలువా., లేక నకిలీవా అని సిబ్బంది సైతం గుర్తించలేకపోతున్నారు.

అయితే ఈ ఉదయం లడ్డూ జారీ సమయంలో టోకెన్లను అనుమానించిన సిబ్బంది.., అధికారులకు సమాచారం అందించారు. కౌంటర్ వద్దకు చేరుకున్న అధికారులు టోకెన్లను చూసి నకిలీవిగా గుర్తించారు. కలర్ జిరాక్స్ తీసి లడ్డూలు పొందటం, వాటిని సిబ్బంది గుర్తించలేకపోవటం ఆశ్చర్యకరమని అంటున్నారు. ఈ ఆలోచన భక్తులకు వచ్చిందా.., లేక జిరాక్స్ షాపుల యజమానులు ఈ అక్రమానికి తెరతీశారా అని విచారణ మొదలు పెట్టారు. అయితే ఇప్పటికే నకిలీ టోకెన్లతో చాలా వరకు లడ్డూలు తీసుకుని ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. పుణ్యం కలగాలని ప్రసాదంగ స్వీకరించే లడ్డూనే అక్రమంగా తీసుకెళ్తే ఇక పాపం ఎక్కడ తొలగుతుంది.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : tirumala laddu  tirupati latest  andhra pradesh news updates  

Other Articles