Anukoledu telugu short film review

anukoledu telugu short film, anukoledu short film, telugu short films, short films in telugu, anukoledu short film review, anukoledu film, anukoledu short film news

anukoledu telugu short film review which is for true lovers who can't express their love

అనుకోలేదు

Posted: 11/08/2014 06:37 PM IST
Anukoledu telugu short film review

కథ : అర్జున్, పూర్ణి.. ఇద్దరు మంచి ఫ్రెండ్స్.. ప్రతిఒక్క పనిలోనూ ఇద్దరు షేర్ చేసుకుంటుంటారు... అందరిలాగే పార్కులకు, షికార్లకు వెళుతుంటారు. అలా హ్యాపీగా సాగుతున్న వారి ఫ్రెండ్ షిప్ లైఫ్ లో అనుకోకుండా ప్రేమ పుడుతుంది. పూర్ణి, అర్జున్ ను ఎంతగానో ప్రేమిస్తుంటుంది. కానీ అర్జున్ మాత్రం తమ మధ్య వున్నది మంచి ఫ్రెండ్ షిప్ అంటూ తన స్నేహితులతో చెబుతుంటాడు. అయితే అర్జున్ కి అమ్మాయిల్లో చాలామంది ఫ్రెండ్స్ వుంటారు. అతను తన ఫ్రెండ్స్ తో వున్నప్పుడు చూసి చాలా నిరాశకు గురవుతుంది. ఈ నిరాశతోనే తన మనసులో వున్న ప్రేమను అర్జున్ కు వ్యక్తపరచాలని నిర్ణయించుకుంటుంది. అందుకు అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధం చేసుకుంటుంది. మరి.. అర్జున్ ఆ అమ్మాయి లవ్ ను ఆక్సెప్ట్ చేస్తాడా..? లేదా..? చివరకు ఏమవుతుంది..? అర్జున్ మనసులో మరెవరైనా వున్నారా..? ఇంతకు పూర్ణి తన మనసులో మాటను తెలియపరుస్తుందా..? లేదా..? అన్న కోణంలో ఈ షార్ట్ ఫిలింను రూపొందించారు.

విశ్లేషణ : ప్రస్తుతకాలంలో వున్న యువతీయువకులందరికీ బాయ్ ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్ అంటే లవర్స్ వుండటం సహజం. మొదట్లో ఫ్రెండ్స్ గా పరిచయమై ఆ తర్వాత అనుకోకుండా ప్రేమలో పడిపోవడం.. ఆ తర్వాత వ్యవహారాలు అందరికీ తెలిసిందే! అయితే కొంతమంది మాత్రం ఫ్రెండ్ షిప్ కు చాలా వ్యాల్యూ ఇస్తారు. అమ్మాయిలు - అబ్బాయిల మధ్య అనుబంధం కూడా మంచిదని భావిస్తూ ఫ్రెండ్ షిప్ కే ఎక్కువ వ్యాల్యూ ఇస్తుంటారు. అయితే అటువంటి వారి మధ్య పుట్టే లవ్ ను ఎక్స్ ప్రెస్ చేయడంలో ఇద్దరు తడబడతారు. ఇతరులతో కూడా తమ ఫీలింగ్స్ షేర్ చేసుకోరు. బహుశా అటువంటివారిని ఉద్దేశించే.. ‘‘అనుకోలేదు’’ అనే షార్ట్ ఫిల్మ్ ను తెరకెక్కించారేమో!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : anukoledu short film  telugu short films  tollywood news  telugu news  

Other Articles