Ready for open debate on hyderabad development will meddle of chandrababu s secrets in vijayawada says kcr

Ready, open debate, Hyderabad, city Development, meddle of secrets, vijayawada, chandrababu, AP chief minister, Telangana chief minister, KCR, TRS, TDP

Ready for open debate on Hyderabad Development, will meddle of chandrababu's secrets in vijayawada says KCR

హైదరాబాద్ అభివృద్దిపై బహిరంగ చర్చకు నేను సిద్దమే..

Posted: 11/02/2014 05:31 PM IST
Ready for open debate on hyderabad development will meddle of chandrababu s secrets in vijayawada says kcr


మొత్తానికి టీడీపీ యువనేత నారా లోకేష్ విసిరిన సవాల్ ను తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రబశేఖర్ రావు స్వీకరించినట్లు వున్నారు. హైదరాబాద్ నగర అభివృద్దిపై దమ్ముంటే చంద్రబాబుతో బహిరంగ చర్చకు రావాలని లోకేష్ ట్విట్టర్ ద్వారా విసిరిన సవాల్ ను కేసీఆర్ స్వీకరించారు. హైదరాబాద్పై తాను బహిరంగ చర్చకు సిద్ధమని స్పష్టం చేశారు. అయితే నారా లోకేష్ పేరును, కానీ టీడీపీ నేతల పేర్లను కానీ ప్రస్తావించకుండానే ఆయన సవాల్ ను స్వీకరిస్తున్నామన్నారు.  హైదరాబాద్ను తామే కట్టామని కొందరు నాయకులు ప్రగల్భాలు పలుకుతున్నారని... వారి హయంలో నగరం లోటెక్కు సిటీగా మారిందన్నారు.

 హైదరాబాద్ మల్కాజ్గిరిలో రూ. 334 కోట్ల పురపాలక అభివృద్ధి నిధులతో నిర్మించిన తాగునీటి పథకానికి కేసీఆర్ శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..హైదరాబాద్లో చారిత్రాత్మకంగా నిలిచిన నీటి వ్యవస్థను గత ప్రభుత్వాలు నాశనం చేశాయని విమర్శించారునగరానికి 500 ఎంజీడీల తాగునీరు అవసరమైతే ప్రస్తుతం 340 ఎంజీడీలు మాత్రమే సరఫరా అవుతుందని చెప్పారు. హైదరాబాద్ విషయంలో ఇంత చేశాం, అంత చేశామని పొడిచేశామని చెప్తున్న నేతలు..వాస్తవానికి మోసం చేశారని విమర్శించారు... హైదరాబాద్పై తాను బహిరంగ చర్చకు సిద్ధమని స్పష్టం చేశారు.

పనిలో పనిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఆయన మరోసారి మండిపడ్డారు. తెలంగాణకు విద్యుత్ రాకుండా చేసింది చంద్రబాబేననంటూ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. విజయవాడలో బహిరంగ సభ పెట్టి చంద్రబాబు బండారం బయటపెడతామని కేసీఆర్ హెచ్చరించారు. అవసరమైతే తాను ఈ సభకు హాజరై బాబు  మోసాన్ని ఆంధ్ర ప్రజలకు వివరిస్తానని తెలిపారు. చంద్రబాబులా తాము ఎప్పుడు ఎక్కడా ప్రజలకు తప్పుడు వాగ్దానాలు ఇవ్వలేదని కేసీఆర్ గుర్తు చేశారు. ఆంధ్రలో ప్రస్తుతం సాగుతుంది ప్రజా వ్యతిరేక పాలన అని ఆయన అభివర్ణించారు. రాష్ట్రంలో విద్యుత్ సమస్య తీరేందుకు ఆరు లేక ఏడు నెలలు పడుతుందని కేసీఆర్ అన్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles