Suspence row continues in maharastra over formation of government

NCP, Maharashtra assembly election, BJP, Narendra Modi, modi mania, shiv sena, congress, MNS

suspence row continues in maharastra over formation of government

మహా సస్పెన్స్..! ప్రభుత్వ ఏర్పాటుపై వీడని ఉత్కంఠ..!

Posted: 10/21/2014 09:55 AM IST
Suspence row continues in maharastra over formation of government

మహారాష్ట్రలో ప్రజా తీర్పు వెలువడినా.. అధికారం ఎవరు చేపట్టనున్నారన్నదానిపై గంటగంటకు ఉత్కంఠత తీవ్రమవుతోంది. అధికారానికి కేవలం 22 స్థానాలతో దూరంగా వున్న బీజేపికి ఇది నిజంగా విషమ  పరీక్షే. ఓటరు తీర్పును శిరసావహిస్తామని చెప్పే పార్టీలు.. ఇప్పుడెలా ఈ పరిస్థితిని అధిగమించనున్నాయి. మహారాష్ట్రంలో అధికారాన్ని చేపట్టే అవకాశం కూడా కేవలం బీజేపికి మాత్రమే వుంది. రెండో అతిపెద్ద పార్టీగా  అవతరించిన శివసేన ఏదేని రెండు పార్టీలు మద్దతు ఇస్తే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం వుంది.  ఈ రెండు పార్టీలే కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నాయన్న వార్తలు వచ్చాయి. ఇప్పటి వరకు ఈ విషయాన్నిరెండు పార్టీల నేతలు ఎవ్వరూ ధృవీకరించకపోవడంతో ఉత్కంట కోనసాగుతోంది. మరోవైపు బీజేపి ఎవరి మద్దతు లేకుండానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనందన్న ఊహాగాలు వినిపిస్తున్నాయి. ఎవరి మద్దతుతో ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారన్న విషయంపై రాష్ట్రంతో పాటు అందరి దృష్టి కేంద్రీకృతమైంది.

రాష్ట్ర ప్రయోజనాలు, సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని కోసం బీజేపీకి బయటి నుంచి ఎన్సీపీ మద్దతు ప్రకటించినా.. ఆ మద్దతును బీజేపి తిరస్కరించింది. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు ఎట్టి పరిస్థితుల్లో ఎన్సీపీ మద్దతు తీసుకోబోమని స్పష్టం చేసింది. ఎన్సీపీతో పొత్తు పెట్టుకుంటే ఓటేసిన ప్రజలతో పాటు, తమను కూడా అవమానపరుచుకున్నట్లేనని అభిప్రాయపడింది. కాగా పాతమిత్రులైన శివసేనతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని బీజేపీకి ఆర్ఎస్ఎస్ సూచించింది. ఈ నేపథ్యంలో ఎన్సీపీ మద్దతుతో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుచేస్తుందా...? శివసేన మద్దతు తీసుకుంటుం దా...? లేదా చిన్న పార్టీలతో పాటు ఇండిపెండెంట్ల సహకారంతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందా అన్న విషయం తేలాల్సి ఉంది.
 
ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై కన్నేసి ఉంచిన శివసేన ఆచి తూచి అడుగులు వేస్తోంది. షరుతలతో కూడిన మద్దతుకు ఆ పార్టీ సిద్దమన్న సంకేతాలను పంపింది. అధికారంలో కీలక శాఖలు లభించినట్లయితే బీజేపీకి మద్దతిచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు శివసేన తెలిపింది. అయితే బీజేపీ నుంచి ఎలాంటి ప్రతిపాదన రాలేదని, ఒకవేళ వచ్చినట్లయితే ప్రతిపాదనను పరిశీలించి తమ నిర్ణయాన్ని తెలుపుతామని శివసేన నాయకులు పేర్కొంటున్నారు.
 
బీజేపీ ఒంటరిగానే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్న ధీమాను ఆ పార్టీ జాతీయ నాయకుడు రాజీవ్ ప్రతాప్ రూడీ వ్యక్తం చేశారు. తమకు 122 స్థానాలు ఉన్నాయని, దీంతో పాటు మిత్ర పక్షాలు, ఇండిపెండెంట్లు ఇతర చిన్న పార్టీలు తమకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అధికారాన్ని చేపట్టేందుకు 145 మ్యాజిక్ ఫిగర్ అవసరం లేదని, అతిపెద్ద పార్టీగా అవతరించడమే చాలన్నారు. ఈ నేపథ్యంలో బీజేపి, శివసేన జతకడుతాయా లేదా..? బీజేపి ఒంటరిగానే అధికారన్ని దక్కించుకుంటుందా..? లేక ఎటూ తేలక ఢిల్లీ అసెంబ్లీ పరిణామాలే ఇక్కడా.. పునరావృతం అవుతాయా..? అన్న సందిగ్ధత ప్రజల్లో నెలకొంది. వీటన్నింటినీ తొలగించడానికి ఇంకెన్ని రోజులు పడుతుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : NCP  Maharashtra assembly election  BJP  Narendra Modi  modi mania  shiv sena  congress  MNS  

Other Articles