Brahmaji chaganti koteswara rao give message to political leaders and people

brahmaji chaganti koteswara rao, brahmaji chaganti koteswara rao news, brahmaji chaganti koteswara rao pravachanalu, telugu tv news channels, telangana political leaders, andhra pradesh political leaders, telugu political leaders, dronamraju satyanarayana wiki, tenneti vishwanatham wiki, visakhapatnam, political life

brahmaji chaganti koteswara rao give message to political leaders and people

రాజకీయనాయకులకు గుణపాఠం చెప్పే నిదర్శ ఘటన!

Posted: 10/15/2014 08:38 PM IST
Brahmaji chaganti koteswara rao give message to political leaders and people

ప్రస్తుత రాజకీయరణరంగంలో వున్న ప్రత్యర్థ నాయకులందరూ ఒకరినొకరు ఏ విధంగా విమర్శించుకుంటారో అందరికీ తెలిసిందే! ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఒకరిమీదొకరు దుమ్మెత్తి పోసుకుంటారే తప్ప... సమస్యల్ని ఎలా పరిష్కరించాలన్న అంశం మీద ఒక్కరుగాక ఒక్కరు నోరు విప్పరు. ప్రజలకు న్యాయం చేసే దిశగా ఆలోచనలు చేయాల్సిందిపోయి... ఎప్పుడు-ఎవరిని-ఎలా తిట్టాలోనన్న వాటిపైనే ఎక్కువగా కాన్సట్రేషన్ చేస్తుంటారు. ఇలా చెప్పుకుంటూపోతే.. ప్రత్యర్థి నాయకుల గొడవలు పడిన విషయాలు మాత్రమే బయటకు వస్తాయి కానీ... ఏరోజైనా వ్యక్తిగతంగా కలిసి మాట్లాడుకున్న దాఖలాలైతే అస్సలు కనిపించవు. ఇంకేమైనా అంటే.. అధికారంలో వున్న పార్టీలకు మాజీలు జంప్ అయిపోయి.. తమ పార్టీ నాయకులే మీద తీవ్ర వ్యాఖ్యానాలు చేస్తారు. అసలు ఈనాటి రాజకీయాల్లో ఎప్పుడు, ఏం జరుగుతుందోనన్న విషయాలను పసిగట్టడం ఎవరివల్ల కాదు. కానీ.. నేటి రాజకీయనాయకులు తెలుసుకోవాల్సిన నిఖార్సైన సంఘటన ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది.

‘‘బ్రహ్మశ్రీ’’ చాగంటి కోటేశ్వరరావు ప్రవచనాలు ఒక ప్రముఖ టీవీ ఛానెల్ లో ‘‘అంతర్యామి’’ అనే కార్యక్రమం ద్వారా ప్రసారమవుతాయనే విషయం విదితమే! ఆయన చెప్పే ఆ ప్రవచనాలు ఎంతో అర్థవంతంగా వుండటంతోపాటు.. అందరి మనసుల్ని దోచేసుకుంటాయి. ఈ నేపథ్యంలోనే బుధవారంనాటి కార్యక్రమంలో ఆయన ‘‘అసూయ’’ గురించి వివరిస్తూ తన జీవితంలో జరిగిన ఒక నిజసంఘటనను వీక్షకులతో పంచుకున్నారు. నేటి రాజకీయనాయకులు తెలుసుకోవాల్సిన నిఖార్సైన నిజమంటూ ఆయన పేర్కొన్నారు. ఆ సంఘటన ఏంటో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం...

‘‘ఆయన చదువుకునే రోజుల్లో ఒకనాడు విశాఖపట్టణంలో ఒక బస్టాండ్ వద్ద నిలబడి వున్నారు. అప్పుడు ఎన్నికలు జరుగుతున్న రోజులు. ఆ ఎన్నికల నేపథ్యంలో దిగ్గజాలు ద్రోణంరాజు సత్యనారాయణ, తెన్నేటి విశ్వనాథం బరిలో వున్నారు. ఎన్నికల సందర్భంగా తమతమ పార్టీ తరఫున ప్రచారంలో దిగిన వారిద్దరూ.. కాకతాళీయంగా బ్రహ్మశ్రీ వున్న చోటుకే చేరుకున్నారు. ఆనాటి ఎన్నికల్లో సత్యనారాయణే గెలిచే అవకాశాలు చాలావరకు వున్నాయని అందరూ అనుకుంటున్నారు. అయినప్పటికీ విశ్వనాథం తన కారు దిగి, సత్యనారాయణ వచ్చి కొద్దిసేపు మాట్లాడారు. ‘‘ఏంట్రా.. ఆ ముఖం ఏంటి? ఎంత నల్లగా పోయిందో చూడు! ఎందుకిలా ఎండలో తిరిగేస్తున్నావ్..? గెలిస్తే ఐదేళ్లే కదా మనం పదవిలో వుండేది.. కానీ దానికంటే మన ఆరోగ్యం చాలా ముఖ్యం. ఎక్కువగా తిరగొద్దు’’ అని సలహా ఇచ్చారు. అంతేకాదు.. అప్పటికప్పుడు ఆయన తన కారులోంచి మజ్జిగను కూడా తెప్పించి, సత్యానారాయణకు ఇచ్చారు.

ఆ సమయంలో సత్యనారాయణ.. ‘‘నేను మిమ్మల్ని ఆశీర్వచనం అడగకూడదు’’ అంటూనే విశ్వనాథం కాళ్లపై పడి.. తాను గెలవాలంటూ ఆశీర్వదించమని కోరారట! అందుకు విశ్వనాథ్ సమాధానమిస్తూ.. ‘‘ఒరేయ్.. నువ్వు గెలిచినా, నేను గెలిచినా కావాల్సింది ప్రజల క్షేమమేరా..! తప్పకుండా గెలువు, విజయీభవ’’ అని ఆశీర్వదించారు చావంటి నాటి ఘటనను మళ్లీ కళ్లకు కట్టినట్టు అందరికీ వివరించారు. అసూయలేని తనానికి విశ్వనాథ వైఖరే నిదర్శమని ఆయన అన్నారు. ఆయనలానే నేటి రాజకీయనాయకులతోపాటు ప్రతిఒక్కరు అసూయకు దూరంగా వుంటూ, ప్రజలతో మమేకంగా మెలగాలని సూచించారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles