Telangana deputy chief minister accept nara lokesh challenge

telangana, deputy chief minister, accepts, nara lokesh, challenge, Rajaiah, telangana development

telangana deputy chief minister accept nara lokesh challenge

సవాళ్లు, ప్రతిసవాళ్లు.. మీరేనా మా భాగ్యవిధాతలు

Posted: 10/10/2014 01:36 PM IST
Telangana deputy chief minister accept nara lokesh challenge

తెలంగాణలో విద్యుత్ సంక్షోభం, తెలంగాణ అభివృద్దిలో చంద్రబాబు పాత్రపై బహిరంగ చర్చకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సిద్దమేనా అంటూ టీడీపీ యువనేత, అధినేత కుమారుడు నారా లోకేష్ విసిరిన సవాల్ ను తెలంగాణ ఉప ముఖ్యమంత్రి రాజయ్య స్వీకరించారు. దొంగే దొంగ అన్నట్టుగా చంద్రబాబు మాట్లాడుతున్నారని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి టి. రాజయ్య అన్నారు. తెలంగాణలో వ్యవసాయ సంక్షోభానికి కారణం చంద్రబాబేనని ఆరోపించారు.

వ్యవసాయం దండగన్నారని, బషీర్బాగ్ లో రైతులపై కాల్పులు జరిపించారని గుర్తు చేశారు. తెలంగాణ అభివృద్ధిపై చంద్రబాబుతో కేసీఆర్ చర్చకు రావాలన్న నారా లోకేష్ సవాల్ స్వీకరిస్తున్నామని చెప్పారు. అంతేకాదు.. భరోసా యాత్ర చేస్తున్న కాంగ్రెస్ నేతల అవినీతి బయటపెడితే జైలుభరో యాత్ర చేయాల్సివుంటుందన్నారు. కాంగ్రెస్ నేతల అవినీతి రుజువైతే తెలంగాణలో ఉన్న జైళ్లు కూడా సరిపోవని రాజయ్య ఎద్దేవా చేశారు.

విద్యుత్ సంక్షోభంపై పదేపదే మాట్లాడుతున్న ఎమ్మెల్సీ షబ్బీర్ అలిపై ఆయన తీవ్రస్వరంతో లేచారు. గతంలో విద్యుత్ మంత్రిగా షబ్బీర్ అలీ ఏం చేశారని ప్రశ్నించారు. అప్పటి తప్పిదాలను కప్పిపుచ్చి ఇఫ్పుడు భరోసాయాత్ర చేస్తారా అని ప్రశ్నించారు. కాగా, రాష్ట్ర ప్రజల ముఖచిత్రాలు మారుస్తారని నమ్మకంతో అక్కడ ప్రజలు చంద్రబాబును, ఇక్కడ ప్రజలు కేసీఆర్ ను అధికారంలోకి తీసుకువస్తే.. తెలుగు వారం, ఇన్నాళ్లు కలసివున్న వారం అన్న విషయాన్ని మరచి సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకోవడంపై తెలుగు ప్రజలు విస్మయం చెందుతున్నారు.

తమ భవితను, భాగ్యరేఖలను మారుస్తారని ఆశిస్తే.. పరస్పర విమర్శలకు పాల్పడటం బాగోలేదని అంటున్నారు. అభివృద్దిలో పోటీ పడినా.. విమర్శల జోలికి వెళ్లవద్దని.. ఈ రెచ్చగోట్టే చర్యల వల్ల తమ తప్పిదాలను కప్పిపుచ్చుకోవాలని యత్నిస్తున్నారని ప్రజలు అనుకుంటున్నారు. ప్రతీ విషయాన్ని ప్రజలు గుర్తుపెట్టకుంటారని వాటి ఫలితం ఎన్నికలలోనే ఇస్తారన్న విషయాన్ని కూడా మరవకూడదని చెప్పారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : telangana  deputy chief minister  accepts  nara lokesh  challenge  Rajaiah  telangana development  

Other Articles