Cm kcr exception rudramadevi movie entertainment tax in telangana

rudrama devi movie, rudrama devi movie entertainment tax, cm kcr news, cm kcr rudrama devi movie, rudrama devi cm kcr news, anushka shetty cm kcr, anushka shetty hot photo shoot, rudrama devi movie photos, director guna shekhar, rana daggubati, allu arjun, chandrababu naidu

cm kcr green signal exception rudramadevi movie entertainment tax in telangana

‘‘రుద్రమదేవీ’’కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సీఎం కేసీఆర్!

Posted: 10/08/2014 08:59 PM IST
Cm kcr exception rudramadevi movie entertainment tax in telangana

అనుష్క శెట్టి లీడ్ రోల్ లో దర్శకుడు గుణశేఖర్ భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న మూవీ ‘‘రుద్రమదేవీ’’! ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీబిజీగా వుంది. ఈ సినిమా ద్వారా ఎట్టి పరిస్థితుల్లోనూ భారీ విజయాన్ని అందుకోవాలని దర్శకుడు గుణశేఖర్ తోపాటు యూనిట్ వర్గాలు కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నాయి. అందుకే.. ఈ సినిమా విడుదలకు ముందు ఎటువంటి ఆటంకాలు వుండకూడదనే ఆలోచనతో దర్శకుడు గుణశేఖర్ ఇటీవలే తెలంగాణ సీఎం కేసీఆర్ ని కలిసి మంతనాలు జరిపారు. ఈ భేటీ సందర్భంగా గుణశేఖర్ తమ సినిమాకి ఎంటర్టైన్ మెంట్ టాక్స్ మినహాయింపు కోసం కలిశారని వార్తలు వచ్చాయి.

తాజాగా అందుతున్న సమాచారాల ప్రకారం.. సీఎం కేసీఆర్ దర్శకుడు గుణశేఖర్ కోరిక మీదుగా ‘‘రుద్రమదేవీ’’ సినిమాకి ఎంటర్టైన్ మెంట్ టాక్స్ ని మినహాయించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. దీంతో ఈ సినిమా ఎటువంటి ఎంటర్టైన్ మెంట్ టాక్స్ లేకుండానే రిలీజ్ కానుందన్నమాట! ఈ విషయం తెలియగానే సంతోషంతో ఉబ్బితబ్బిబ్బవుతున్న దర్శకుడు గుణశేఖర్.. త్వరలోనే ఏపీ సీఎం చంద్రబాబుతోనూ కలిసి అక్కడ కూడా తమ సినిమాకు ఎంటర్టైన్ మెంట్ టాక్స్ ని రద్దు చేయాలని కోరనున్నట్లు యూనిట్ వర్గాల నుంచి వస్తున్న సమాచారం! భారీ బడ్జెట్ తో ఈ మూవీని నిర్మించారు కాబట్టి.. ఇతర ఖర్చులు ఎక్కువ చేయకుండా జాగ్రత్త పడాలనే ఆలోచనలో దర్శకుడు వున్నాడు. తెలంగాణాలో టాక్స్ ఇబ్బంది తీరిపోయింది కాబట్టి.. ఇక ఆంధ్రాలో మాత్రం ఒక్కటే ఆ సమస్యను పరిష్కరించుకోవాల్సి వుంది.

‘‘రుద్రమదేవీ’’గా అనుష్క సరికొత్త రూపంలో కనిపిస్తుండగా.. రానా ఇందులో ఛాళుక్యవీరభద్రుడిగా నటిస్తున్నాడు. అలాగే అల్లుఅర్జున్ ‘‘గోనగాన్నారెడ్డి’’ అనే స్పెషల్ పాత్రలో సరికొత్త అవతారంలో కనువిందు చేయనున్నాడు. ఇళయరాజా మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాకి తోట తోరణి అలనాటి కట్టడాలను సెట్స్ గా రూపకల్పన చేశారు. ఇలా ఇంతటి భారీతారాగణంతోపాటు భారీ సెట్స్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమా.. భారీ విజయంతోపాటు బడ్జెట్ కంటే ఎక్కువే లాభాలను రాబడుతుందని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు. అలాగే ఈ సినిమా అనుష్క, రానా, అల్లు అర్జున్ లకు ఓ మైలురాయి అవుతుందనే భావనను యూనిట్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rudrama devi movie  kcr  director gunashekhar  allu arjun  rana daggubati  

Other Articles