No security in ministry of defence

Ministry of Defence, Agreement documents, No security, Hak jets, Missing

Important Agreement documents missing in Ministry of Defence

రక్షణ మంత్రిత్వ శాఖలోనే రక్షణ కరువు..

Posted: 09/17/2014 03:09 PM IST
No security in ministry of defence

అది దేశ రక్షణ మంత్రిత్వ శాఖ కార్యాలయం. అందులోకి వెళ్లాలంటేనే కట్టదిట్టమైన భద్రతా వలయం వుంటుంది. పార్లమెంటులోని సౌత్ బ్లాకులో వుంటే ఈ మంత్రిత్వశాఖ కార్యాలయంలో భద్రంగా దాచివున్న ఒప్పంద పత్రాలు అదృశ్యమయ్యాయి. సాదాసీదా కార్యాలయంలోనే కీలక డాక్యుమెంట్లు కనిపించకుండా పోతేనే గగ్గోలు పెడతారు. కానీ ప్రభుత్వ కార్యాలయాలు అందులోనూ కేంద్ర రక్షణ శాఖ కార్యాలయంలో కీలక డాక్యుమెంట్లు అదృశ్యమైనా.. ఏళ్ల తరువాత వాటిని కనిపించకుండా పోయాయని గుర్తించారు.

రక్షణ మంత్రిత్వ శాఖలో కీలక ఒప్పంద పత్రాలు ఎప్పుడు, ఎక్కడ పోయాయన్న విషయం కూడా పట్టకపోవడం విమర్శలకు తావిస్తోంది. అధునాతన హాక్ జెట్ విమానాలకు సంబంధించి స్వాధీన పత్రాలు కనిపించకుండా పోయినట్లు రక్షణ శాఖ అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఈ ఒప్పందం విలువ దాదాపు రూ.రెండు వేల కోట్లు. 123 హాక్ జెట్ విమానాల కోసం గతంలో కేంద్రం.. బ్రిటీష్ కంపెనీకి ఆర్డరు ఇచ్చింది. వీటిలో మొదటి దశ కింద రావాల్సిన 60 విమానాలలో 2004లో 40 విమానాలను స్వాధీనం చేసుకున్నారు.

మిగిలిన 20 విమానాలను స్వాధీనం చేసుకుందామనుకున్న తరుణంలో పత్రాలు కనిపించకుండా పోయాయి. విషయాన్ని గోప్యంగా వుంచిన అధికారులు కార్యాలయం అంతా చూశారు. అయినా కనబడకపోయే సరికి విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువచ్చారు. దీనిని తీవ్రంగా పరిగణించిన రక్షణ మంత్రిత్వ శాఖ సంబంధిత అధికారులపై విచారణకు ఆదేశించింది. కార్యాలయ సిబ్బంది పనితనం ఫలితంగా 20 హాక్ జట్ విమానాల స్వాధీనం మరో ఏడాది పాటు ఆలస్యం అయ్యే అవకాశముందని అధికారుల భావిస్తున్నారు..

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ministry of Defence  Agreement documents  No security  Hak jets  Missin  

Other Articles