Telangana it minister ktr comments on narendra modi jagga reddy

telangana it minister ktr, ktr latest news, ktr news, ktr narendra modi jagga reddy, jagga reddy news, jagga reddy medak mp elections, narendra modi, jagga reddy narendra modi

telangana it minister ktr comments on narendra modi jagga reddy in medak district campaign

మోడీ - జగ్గారెడ్డిలకు చురకలంటించిన కేటీఆర్!

Posted: 09/06/2014 09:57 AM IST
Telangana it minister ktr comments on narendra modi jagga reddy

(Image source from: telangana it minister ktr comments on narendra modi jagga reddy)

మెదక్ ఉపఎన్నికల నేపథ్యంలో పార్టీల మధ్య వాడీవేడీగా యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే! ఇందులో భాగంగా రెండు జాతీయ పార్టీలు (బీజేపీ, కాంగ్రెస్), టీఆర్ఎస్ పార్టీల మధ్య హోరాహోరీగా మాటలయుద్ధం జరుగున్న విషయం విదితమే! ఆయా పార్టీలకు చెందిన నాయకులు తమ పార్టీయే గెలుస్తుందంటూ డప్పు వాయించుకోవడంతోపాటు ప్రత్యర్థ పార్టీలపై విమర్శనాస్త్రాలు చేస్తున్నారు. ఇక టీఆర్ఎస్ పార్టీ అయితే తమ పార్టీయే ఇందులో గెలుస్తుందనే ధీమా వ్యక్తం చేస్తూనే తమకు పోటీగా నిలబడిన పార్టీలను ఏకిపారేస్తున్నారు. రోజుకొక టీఆర్ఎస్ నాయకుడు ప్రచారనేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీల మీద విమర్శలు చేస్తూనే జగ్గారెడ్డిపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే తెలంగాణ ఐటీశాఖమంత్రి కేటీఆర్ కూడా బీజేపీ పార్టీ మీద ధ్వజమెత్తారు. సాక్షాత్తూ నరేంద్రమోడీ వచ్చి ప్రచారం చేసినా.. జగ్గారెడ్డి మెదక్ ఉపఎన్నికల్లో గెలవలేరంటూ తేల్చిపారేశారు. మెదక్ జిల్లాలోని మిరుదొడ్డిలో ఆయన మాట్లాడుతూ.. సమైక్యవాది అయిన జగ్గారెడ్డి అంటేనే మెదక్ జిల్లా ప్రజలు మండిపడుతున్నారని అన్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ తమ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మెదక్ ఉపఎన్నికల్లో గెలుస్తారని ధీమా వ్యక్తం చేసిన ఆయన... కాంగ్రెస్ అభ్యర్థి సునీతా లక్ష్మారెడ్డికి ఓట్లు అడిగే హక్కులేదన్నారు. బీజేపీ పార్టీ హవా తెలంగాణాలో లేదని.. ఆ పార్టీ తరఫునుంచి సాక్షాత్తూ ప్రధాని మోడీ వచ్చి ప్రచారాలు చేసినా.. తెలంగాణ ప్రజలు వారికి ఓటు వేయరనే భావాన్ని ఆయన వ్యక్తం చేశారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ktr  narendra modi  jagga reddy  medak mp elections  

Other Articles