Chandrababu naidu controversial statements on adhar card

chandrababu naidu, adhar card, aadhar card, chandrababu naidu adhar card, congress government, upa government, aadhar card gas link, ap people

chandrababu naidu controversial statements on adhar card

ఏపీకి పెద్ద షాకిచ్చిన బాబు.. ‘‘ఆధార్’’ వుంటేనే పథకాలు!

Posted: 08/26/2014 02:59 PM IST
Chandrababu naidu controversial statements on adhar card

సార్వత్రిక ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు తన గురించి, పార్టీ గురించి, ప్రవేశపెట్టబోయే పథకాల గురించి ఎన్ని ప్రచారాలు చేసుకున్నారో అందరికీ తెలిసిన విషయమే! అంతెందుకు ఈయన ప్రచారాల్లో భాగంగా నరేంద్రమోడీ కూడా గళం కలిపారు. స్వర్ణాంధ్రప్రదేశ్ కావాలంటే బాబును గెలిపించండంటూ మోడీ కూడా బాబుకు మద్దతుగా ప్రచారం చేశారు. ఆ నేపథ్యంలో బాబు.. ‘‘బాబు కావాలంటే బాబును గెలిపించండి.. రైతులకు రుణమాఫీ ఖాయం.. పేదప్రజలందరికీ ఎన్నోరకాల సంక్షేమ పథకాలు’’ వంటివి బాగానే డప్పు వాయించుకున్నారు. పైగా ఈయనకు 30 సంవత్సరాల రాజకీయ అవగాహన వున్న వ్యక్తి కావడంతో ప్రజలు ఈయన చెప్పిన మాటలను నమ్మి ఓట్లేసి గెలిపించారు. ఆయన అన్నట్టు ప్రస్తుతం ఏపీ విషయంలో చాలానే కష్టాలు పడుతున్నారు. రాష్ట్రాభివృద్ధికోసం రాత్రింబవళ్లు శ్రమించడం.. రైతులకు రుణాల మాఫీ చేయడం కోసం బ్యాంకుల అధికారాలతో - కేంద్ర ప్రభుత్వంతో నిత్యం మంతనాలు జరుపుతున్నారు.

ఇంతవరకు అంతా బాగానే వుంది కానీ.. తాజాగా ఆయన విడుదల చేసిన ఒక ప్రకటన మీద ఏపీ ప్రజలు ఆగ్రహావేశాలను వ్యక్తం చేస్తున్నారు. నిన్నమొన్నటివరకు అందరికీ సంక్షేమపథకాలు అమలవుతాయని పేర్కొన్న బాబు.. సడెన్ గా మాట మార్చేశారు. ప్రభుత్వం అమలు చేసే ప్రతి పథకానికి ఆధార్ కార్డుతో లింక్ తప్పనిసరి అంటూ ఆయన వెల్లడించారు. అంటే.. ప్రభుత్వం విడుదల చేసే పథకాలన్నింటినీ పొందాలనుకుంటే తమ ఆధార్ కార్డును చూపించినప్పుడు మాత్రమే వాటిని సొంతం చేసుకుంటారు. మరి.. ఆ ఆధార్ కార్డులు లేనివారి పరిస్థితి ఏమిటి..? అసలు ఆంధ్రాలో ఎంతమందికి ఆధార్ కార్డులున్నాయి..? అన్న విషయం క్లారిటీ లేకుండా బాబు ఇలా వ్యాఖ్యానించడం చాలా విచారకరంగా వుందంటూ ఏపీ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నిజానికి యూపీఏ ప్రభుత్వం అప్పట్లో రిలీజ్ చేసిన కార్యక్రమాల్లో ఈ ఆధార్ కార్డు ఎంతో ఘోరంగా విఫలం అయింది. ఈ ఆధార్ కార్డులు సరఫరా ఇంకా పూర్తి కాకముందే ఆ ప్రభుత్వం గ్యాస్ తో లింక్ పెట్టి.. సిలిండర్ కు సంబంధించిన రాయితీని లబ్దిదారు బ్యాంకు అకౌంట్లో జమచేసే పద్ధతిని అమలు చేసి ఎంతో రాద్ధాంతం చేసిందో అందరికీ తెలిసిందే! దాంతో మనోళ్లు ఆ కార్డు కోసం పడిన కష్టాలు అన్నీఇన్నీ కావు. ఎండనకా.. వాననకా నడిరోడ్డు మీద కొన్నిరోజుల వరకు క్యూలో నిలబడిన వాళ్లూ వున్నారు. ఇంకా ఆ కార్డులు అందనివారూ వున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆధార్ కార్డుకి, సంక్షేమ పథకాలకు లింకేంటి..? అంటూ అందరూ ఆవేదనతో ప్రశ్నలను లేవనెత్తుతున్నారు. మరి ఈ వ్యవహారంలో ఆయన ఏ నిర్ణయం తీసుకుంటాడో వేచి చూడాల్సిందే!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chandrababu naidu  aadhar card  congress government  andhra pradesh state  

Other Articles