Prakash raj tweets about his madapur accident

Prakash Rajroad accident, Prakash Raj Madapur Accident, Prakash Raj escapes, Actor-filmmaker Prakash Raj, Prakash Raj Tweets, Prakash Raj Tweets Madapur Accident,

Prakash Raj Tweets About his Madapur Accident:Actor-filmmaker Prakash Raj Tuesday had a narrow escape when his car was rammed by a bus while waiting at a traffic signal..

చావు తప్పింది- నాకు సిగ్గుగా ఉంది: ప్రకాష్ రాజ్

Posted: 08/13/2014 08:41 AM IST
Prakash raj tweets about his madapur accident

ప్రకాష్ రాజ్ ప్రయాణిస్తున్న కారును మాదాపూర్ లోని సైబర్ టవర్స్ సమీపంలో సోనీ ట్రావెల్స్ కు చెందిన ప్రైవేటు బస్సు వెనక నుంచి ఢీ కొట్టింది. ఈ సంఘటనలో ప్రకాష్ రాజ్ కారు దెబ్బతిన్నప్పటికీ... ఆయన ఎలాంటి గాయాలు కాకుండా తప్పించుకోగలిగారు. అదే బస్సు ఆయన కారుతో పాటు పక్కనున్న ఆటోను కూడా ఢీ కొట్టింది. దీంతో ఆటోలో ఉన్న ఓ కుటుంబానికి చెందిన సభ్యులందరూ రోడ్డు మీద పడ్డారు.

ఈ ప్రమాదంలో అక్షయ అనే చిన్నారితో పాటు కుటుంబసభ్యులందరికీ తీవ్రగాయాలయ్యాయి. అయితే అక్కడ గుమిగూడిన ప్రజలు గాయాలతో బాధపడుతున్న కుటుంబాన్ని కాపాడాల్సింది పోయి... ప్రకాష్ రాజ్ ను ఫొటోలు తీయడం మొదలుపెట్టారు. దీనిపై ప్రకాష్ రాజ్ తన ఆవేదనను ట్విట్టర్ లో వ్యక్తం చేశారు.

ఆటో లోంచి రోడ్డు మీదకి విసిరేసినట్లుగా పడిపోయిన వారిని కాపాడకుండా... అక్కడ గుమిగూడిన చాలా మంది యువకులు తన ఫొటోలు తీయడంలో బిజీగా ఉండడం చూసి దిగ్భ్రాంతికి గురయ్యానని ప్రకాష్ రాజ్ కామెంట్ చేశారు. చావుకు దగ్గర దాకా వెళ్లానన్న షాక్ కంటే... ప్రజల అమానవీయ ప్రవర్తనే తనను ఎక్కువగా కలచివేసిందని ప్రకాష్ రాజ్ అన్నారు. ఈ సంఘటన తలుచుకుంటేనే తనకు సిగ్గుగా ఉందని... మన యువత ఎటు పోతోందని ప్రకాష్ రాజ్ ట్విట్టర్ లో ప్రశ్నించారు.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles