Rbi anytime anywhere bill payment program

ribi, bill payment, reserve bank of india, bill payment option, municipal taxes bill, school fees.

RBI Anytime Anywhere bill payment program

ఏ బిల్లు ఎక్కడైనా చెల్లింపుకు RBI ప్రణాళిక

Posted: 08/08/2014 09:35 AM IST
Rbi anytime anywhere bill payment program

దేశంలో ఎక్కడున్నా, ఎప్పుడైనా బిల్లులను చెల్లించే విధానానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారాలు తెరుస్తోంది.   అందుకు గురువారం మార్గదర్శకాలను వెల్లడి చేసిన రిజర్వ్ బ్యాంక్ సెప్టెంబర్ 5 లోపులో అభిప్రాయాలను కోరుతున్నట్లుగా తెలియజేసింది.  

భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ (బిబిపిఎస్) ను అమలు చెయ్యటానికి ఆర్ బి ఐ రూపొందించిన మార్గదర్శకాలలో, నగదు, చెక్ ఇలా ఏ రూపంలోనైనా బిల్లుల చెల్లింపులను చెయ్యటానికి వెసులుబాటు కలిగిస్తోంది.  ఆర్ బి ఐ అంచనా ప్రకారం దేశంలోని 20 నగరాలలో సంవత్సరానికి 30800 మిలియన్ బిల్లుల చెల్లింపులు 6 లక్షల కోట్ల రూపాయల మేరకు జరుగుతున్నాయి. 

ఇందులో రకరకాల వినియోగదారుల బిల్లులు, స్కూల్ ఫీజ్, యూనివర్శిటీ ఫీజ్, మునిసిపల్ టాక్సెస్ ఉన్నాయి.  కానీ వాటితో అనుసంధానం లేకపోవటం వలన అన్ని చోట్ల నుంచి పేమెంట్స్ చెయ్యలేకపోతున్నారని, దాన్ని అధిగమించి ఏజెంట్ల ద్వారా ఈ పేమెంట్లను చెయ్యగలిగితే దేశంలో ఎక్కడినుంచైనా ఈ వెసులుబాటును ఉపయోగించుకోవచ్చునని ఆర్ బి ఐ చెప్తోంది.

బిల్లుల సెటిల్ మెంట్, కస్టమర్ల అభ్యంతరాల పరిశీలన, బాధ్యతలు ఇలాంటి విషయాలలో ఆర్ బి ఐ స్పష్టత తీసుకునివచ్చే ప్రయత్నం చేస్తోంది.   ఏజెంట్ల ద్వారా వివిధ రూపాలలో చేసే ఈ బిల్లు చెల్లింపులను తక్షణ ధృవీకరణ చేసే విధంగా ఎలక్ట్రానిక్ అనుసంధానం కలిగివుండేట్టుగా ఈ బిబిపిఎస్ కింద భారత్ బిల్ పేమెంట్ ఆపరేటింగ్ యూనిట్స్ (బిబిపిఓయు) లు పనిచేస్తాయి.  

ఇలా బిల్లు చెల్లింపులను ఎక్కడినుంచైనా చెయ్యటం కోసం సురక్షితమైన విధానాన్ని నెలకొల్పాలని కోరుతున్న రిజర్వ్ బ్యాంక్, ప్రస్తుతం ఆన్ లైన్ పేమెంట్లు కొన్ని అమలులో ఉన్నా, అవి అన్ని రకాల బిల్లుల చెల్లింపుల విషయంలో కస్టమర్లకు సంతృప్తికరమైన సేవలను అందించలేకపోతున్నాయని అంటోంది.  

బిల్లు చెల్లింపుల విషయంలో కావలసినవి- ఏ విధమైన చెల్లింపులనైనా స్వీకరించటం, తక్షణ ధృవీకరణ, సురక్షితమైన విధానం.  వీటిని సాధించినట్లయితే రిజర్వ్ బ్యాంక్ కోరుకున్నట్లుగా అన్ని రకాల బిల్లుల చెల్లింపులూ కేంద్రీకృతమైన ఆన్ లైన్ విధానంలోకి రావటమే కాకుండా ఇ సేవ, మీ సేవ లాంటి ఉపాధి కల్పన కూడా జరుగుతుంది.  


-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : reserve bank  bill payment  rbi  e seva  

Other Articles