Pawan kalyan warns who misuses his name

pawan kalyan janasena party, pawan kalyan warns who misuses his name, pawan kalyan waiting for party

pawan kalyan warns who misuses his name

పవన్ జారీచేసిన హెచ్చరికలు

Posted: 07/14/2014 03:39 PM IST
Pawan kalyan warns who misuses his name

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తన మీద వస్తున్న వార్తల దృష్ట్యా హెచ్చరికలను జారీచేసారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానికోసం తన పేరును వాడుకుంటూ కొందరు నిధులను కూడగడుతున్నారని తెలిసిందని, తన పేరును దుర్వినియోగం చేస్తున్నారని, అటువంటి వారిని ఉపేక్షించేది లేదని, అటువంటివారు తీవ్ర పరిణామాలను ఎదుర్కోవలసివస్తుందని పవన్ కళ్యాణ్ అన్నారు.  

తను సైలెంట్ గా ఉండటం మీద కూడా కొందరు వ్యాఖ్యానాలు చేసారని, అయితే తను కేవలం జనసేన పార్టీకి అధికారికంగా లభించే గుర్తింపు కోసమే ఎదురుచూస్తున్నానని, ఆ తర్వాత తన పార్టీ విధివిధానాలను తెలియపరుస్తానని అన్నారు.  ఈలోపులో తన పేరును కానీ పార్టీ పేరును కానీ ఉపయోగిస్తూ ఎవరైనా అక్రమాలకు పాల్పడితే ఊరుకునేది లేదని పవన్ కళ్యాణ్ గట్టిగా హెచ్చరించారు.  రాజధానికోసం నిధులను పోగుచెయ్యమని తానెవరికీ చెప్పలేదని, అందుకు ఎవరినీ నియమించలేదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేసారు.

2014 ఎన్నికలలో కేంద్ర ప్రభుత్వాన్ని స్థాపించటానికి భారతీయ జనతా పార్టీకి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గెలవటం కోసం పవన్ కళ్యాణ్ పాటుపడ్డారు.  అయితే ఆ తర్వాత సైలెంట్ అయిపోయిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు పెదవి విప్పి, తన గురించి ఎవరు తప్పుగా మాట్లాడినా ఊరుకునేది లేదని హెచ్చరించారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles