New twists in preity zinta complaint on ness wadia

New twists in Preity Zinta complaint on NesS Wadia, Mafia involvement in Preity Zinta case, Wadia

New twists in Preity Zinta complaint on NesS Wadia

ప్రీతీ జింటా కేసులో కొత్త మలుపు, మాఫియా రంగు!

Posted: 06/18/2014 06:24 PM IST
New twists in preity zinta complaint on ness wadia

హిందీ సినీ తార ప్రీతీ జింటా తన మాజీ ప్రియుడు నెస్ వాడియా మీద పెట్టిన కేసుకి మాఫియా రంగు పడింది.  

నెస్ వాడియా తండ్రి నస్లి వాడియా తనకు ప్రీతీ జింటా కేసులో కలుగజేసుకోవద్దని మంబై డాన్ రవి పూజారీ నుంచి బెదిరింపులు వస్తున్నాయని పోలీసులుకు ఫిర్యాదుచేసారు.  తనకి రవి పూజారి నుంచి ఎస్ఎమ్ఎస్ ద్వారా బెదిరింపులు వచ్చాయని ఆయన ఫిర్యాదు చేసారు.  ఈ ఫిర్యాదును నస్లి వాడియా కార్యదర్శి పోలీసులకు ఇవ్వగా వాళ్ళు దాన్ని తీసుకుని నస్లి వాడియా వాంగ్మూలాన్ని కూడా తీసుకుంటామని చెప్పారు.  

వాడియా వ్యాపార సంస్థ కూడా ఎస్ఎమ్ జోషి మార్గ్ పోలీస్ స్టేషన్లో మాఫియా నుంచి బెదిరింపులు వస్తున్నాయని ఫిర్యాదు చేసింది.  

ప్రీతీ జింటా విదేశాలనుంచి రాగానే ఆమె దగ్గర్నుంచి కూడా వాంగ్మూలాన్ని తీసుకోనున్నట్లు పోలీసులు తెలియజేసారు.  

నెస్ వాడియా వాంఖడే స్టేడియంలో అందరి ముందు తనని దుర్భాషలాడాడని ప్రీతీ జింటా చేసిన ఫిర్యాదు మీద ప్రస్తుతం పోలీసు విచారణ జరుగుతోంది.

అయితే ఇందులో మరో తాజా ట్విస్ట్ ఏమిటంటే, ప్రీతీమీద ఆమె మాజీ ప్రియుడు అత్యాచారానికి ఒడిగట్టలేదని ఆమె లాయర్ అన్నారు.  ఆమె చేసిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు నెస్ వాడియా మీద మహిళ మీద గౌరవాన్ని దెబ్బతీసే విధంగా చేసిన ప్రవర్తనకి ఐపిసి సెక్షన్ 509, 354, శాంతికి భంగం కలిగించినందుకు సెక్షన్ 504, బెదిరించినందుకు సెక్షన్ 506 ల కింద కేసు నమోదు చేసారని చెప్పిన ఆమె లాయర్ ఆమె నెస్ వాడియా మీద మే 30న గార్వారే పెవిలియన్ లో బహిరంగంగా అందరి సమక్షంలో హెరాస్ చేసాడని మాత్రమే ఫిర్యాదు చేసిందని, అయితే ఆమె చేసిన ఫిర్యాదు మీద నిజానిజాలను పోలీసులు తరచి చూస్తున్నారని అన్నారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles