Governments snooping has no limits says vodafone

Governments snooping has no limits says Vodafone, Vodafone gave customer information to 29 countries, India took customer information from Vodafone

Governments snooping has no limits says Vodafone

సర్కార్ల స్నూపింగ్ కి హద్దులేదు- వోడాఫోన్!

Posted: 06/07/2014 03:44 PM IST
Governments snooping has no limits says vodafone

మీరు ఫోన్లో మాట్లాడేటప్పుడు అవతలి వారి చెవిలో చల్లగా పడేసే మీ మాటలు వేరెవరికీ తెలియకుండా ఉంటాయనుకుంటే పొరపాటే! 

ఫోన్లకీ చెవులుంటాయి.  ప్రభుత్వాధికారులు కానీ పోలీసులు కాని అడిగితే మీ గురించిన వివరాలు, మీరు చేసిన కాల్స్ వివరాలే కాకుండా మీ మాటలు, మీ మెసేజ్ లను కూడా టెలిఫోన్ శాఖలు లేచి నిల్చుని నమస్కారం పెట్టి మరీ ఇచ్చేస్తాయి.  ఈ సంగతి అక్కడక్కడ చెప్పుకున్న విషయం కాదు సాక్షాత్తూ ఫోన్ సేవలను అందించే సంస్థే ఈ విషయాన్ని వెల్లఢి చేసింది.

భారత్ తో సహా ప్రపంచంలోని 29 దేశాల ప్రభుత్వాలు టెలిఫోన్ వినియోగదారుల సంభాషణలను, సంక్షిప్త సమాచారాలను దొంగిలించి వాడుకుంటున్నాయని యుకె కి చెందిన వోడాఫోన్ బహిర్గతం చేసింది.  2013-14 లో ఎన్నో సందర్భాల్లో చట్టాలను అమలుపరచే శాఖలనుంచి  వోడా ఫోన్ వినియోగదారుల సమాచారాన్ని తీసుకోవటం జరగిందని ఆ సంస్థ చెప్తోంది.  

నిజానికి భారతదేశం లోని చట్టాలు అందుకు అంగీకరించవు.  ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ 1885 టెలిఫోన్ సేవలందించేవారు చట్టాన్ని అమలు చేసేవారు తీసుకునే సమాచారంలో గోప్యతను పాటించాలని చెప్తోంది.  ఐటి యాక్ట్ 2000 ప్రకారం, ప్రభుత్వం నుంచి కాని లేదా చట్టాన్ని అమలుపరచే శాఖలనుండి కోరి తీసుకున్న వివరాలను బహిర్గతం చెయ్యగూడదని చెప్తోంది.      

చట్టపరంగానే కాకుండా వృత్తి ధర్మంగా తీసుకున్నా కూడా, వినియోగదారులకు చెందిన సమాచారంలో గోప్యతను పాటించటం అవసరమే కానీ, వివిధ దేశాలలోని ప్రభుత్వాలు అడిగిన సమాచారాన్ని ప్రభుత్వానికి చెందిన దర్యాప్తు సంస్థలు, చట్టాన్ని అమలుపరచే శాఖలు, ప్రభుత్వ అధికారులకు ఇవ్వటం కూడా అంతే అవసరమని వోడా ఫోన్ చెప్తోంది. 

అయితే, చివర్లో వోడాఫోన్ సంస్థ అసలు సంగతి కూడా బయటపెట్టింది.  మా వినియోగదారుల గురించిన సమాచారాన్ని ప్రభుత్వాలకు అందకుండా "మేము అడ్డుపడితే, ప్రభుత్వాలు మా లైసెన్స్ లను రద్దుచేసి మా వినియోగదారులకు మేము టెలిఫోన్ సేవలందించకుండా మాకు అడ్డుపడే అవకాశం ఉంది" అంటూ వోడాఫోన్ చివర్లో చల్లగా చెప్పింది!

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles