Modi creates sit to investigate black money

Modi creates SIT to investigate black money, Black money cases come under SIT, SIT reports to SC, SC gives directions to SIT, UPA Govt did not create SIT

Modi creates SIT to investigate black money

నల్లధనానికిక చెల్లు చీటీ!

Posted: 05/28/2014 08:52 AM IST
Modi creates sit to investigate black money

ప్రధాన మంత్రి మొదటి నుంచీ చెప్తున్న విధంగానే నల్ల కుబేరుల పీచమణచటానికి సిద్ధమయ్యారు.  సుప్రీం కోర్టు, యుపిఏ ప్రభుత్వాల మధ్య ఎటూ తెగని నల్లధనం వెలికితీత కార్యక్రమానికి మోదీ తన మొదటి కేబినెట్ సమావేశంలోనే మార్గాన్ని తెరిచారు.  నల్లధనానికి సంబంధించిన కేసుల మీద జస్టిస్ ఎమ్ బి షా, జస్టిస్ అరిజిత్ పసాయత్ ల నేతృత్వంలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) ని నియమించారు.  ఈ కేసులలో యుపిఏ ప్రభుత్వం లోగడ సిట్ ని నియమించటానికి నిరాకరించింది.  సుప్రీం కోర్టుతో యుపిఏ నాటకీయంగా ఎప్పటికప్పుడు దాటవేస్తూవచ్చింది.  కానీ మోదీ ప్రధానమంత్రి కావటంతోనే సిట్ నియామకం చెయ్యటం విశేషం.  

విదేశాలనుంచి నల్లధనాన్ని వెలికితీస్తాం అన్న భారతీయ జనతా పార్టీ తన మాట నెగ్గించుకునే సంకేతాలు కనిపిస్తున్నాయి.  సిట్ ఎప్పటికప్పుడు సుప్రీం కోర్టుకి నివేదికలను సమర్పించటం, సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు పనిచెయ్యటం చేస్తుంది.   సిట్ కి నేతృత్వం వహించే న్యాయమూర్తులకు కేంద్ర రెవిన్యూ కార్యదర్శి, సిబిఐ, ఇంటెలిజెన్స్ బ్యూరో, రా, ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ లోని డైరెక్టర్లు, కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డ్ ఛైర్మన్, రిజర్వ్ బ్యాంక్ డెప్యూటీ గవర్నర్ సహాయ సహకారాలందిస్తారు.  

సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు బుధవారం లోపులో సిట్ ని నియమించవలసి వుండగా మోదీ ఒకరోజు ముందే ఆ పని చేసిచూపించారు.  దానితో నల్లధనం కలవారికి పరోక్షంగా యుపిఏ నుంచి లభించిన సహకారానికి చెల్లుపడింది.  జూలై 4, 2011 లోనే సిట్ ని ఏర్పాటు చెయ్యమని సుప్రీం కోర్టు చెప్పినా యుపిఏ ప్రభుత్వం ఆ పని చెయ్యలేదు.  మరోసారి ఈ నెల 1 న 4 న కూడా సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చినా యుపిఏ ససేమిరా అంది.  ఈ నెల 16న కూడా సిట్ ని ఏర్పాటు చెయ్యలేమని, విదేశాలలో ఎల్ జి టి బ్యాంక్ లో భారతీయులు దాచుకున్న నల్లధనం బాపతు వివరాలను కూడా బయటపెట్టలేమంటూ ప్రకటించింది.  అయితే మోదీ మాత్రం సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు సిట్ ని ఏర్పాటు చేసి నల్లధనాన్ని వెలికి తీయటానికి కంకణబద్ధులన్న విషయాన్ని రూఢిచేసారు.

నల్ల ధనానికి సంబంధించిన అన్ని కేసులు, ఇప్పటికే మొదలైనవి కూడా సిట్ పరిధిలోకి వస్తాయి.  దర్యాప్తులో తేలిన విషయాలను సుప్రీం కోర్టుకి నేరుగా అందజేయటం, సుప్రీం కోర్టు నుంచి ఆదేశాలను నేరుగా అందుకోవటం వలన ఈ దర్యాప్తులో రాజకీయ ప్రమేయాలు ఉండే వీలుండదు.  అందుకే యుపిఏ ప్రభుత్వం ఎప్పటికప్పుడు సిట్ నియామకాన్ని దాటవేస్తూవచ్చింది.

దేశంలోను, ఎక్కువగా విదేశాలలోనూ మూలుగుతున్న నల్ల ధనాన్ని వెలికితీస్తే భారత దేశాభివృద్ధి వేగవంతమౌతుందని మోదీ ఆలోచన.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles