Last phase of 16th lok sabha elections

Last phase of 16th Lok Sabha elections, Lok Sabha elections 2014, Lok Sabha elections, India General Elections 2014, elections 2014, general elections 2014, parliament elections 2014, India elections 2014, Assembly Elections 2014,Lok Sabha Elections 2014 news, Lok Sabha Elections 2014

Last phase of 16th Lok Sabha elections

16 వ లోక్ సభ పోటాపోటీ ఆఖరి దశ పోలింగ్

Posted: 05/12/2014 08:25 AM IST
Last phase of 16th lok sabha elections

ఈరోజు 16 వ సార్వత్రిక ఎన్నికల ఆఖరి దశ పోలింగ్ జరుగుతోంది.  దీనితో ఎన్నికల హడావిడి అయిపోయినట్లే.  ఇప్పటికే రాజకీయ పార్టీలన్నీ ఎవరి అంచనాలు వారు వేసుకుంటున్నారు.  ప్రతి పార్టీ కూడా తమ గెలుపు ఖాయమనే అంటోంది.  

ఈరోజు ఉత్తర ప్రదేశ్ లో 18 పార్లమెంట్ స్థానాలకు, బీహార్ లో 6, పశ్చిమ బెంగాల్ లో 17 స్థానాలకు పోలింగ్ ప్రారంభమైంది.  ఈ ఆఖరి దశ ఎన్నికలలో 602 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, తొమ్మిది కోట్ల వోటర్లు తమ తమ ప్రియతమ నాయకుడిని గెలిపించాలనే ఆకాంక్షతో వోటు వెయ్యనున్నారు.  

ఈ సారి పోలింగ్ లో విశేషం భారతీయ జనతా పార్టీ అభ్యర్తి నరేంద్ర మోదీ వారణాసి నుంచి పోటీ చెయ్యటం, ఆయన మీద పోటీగా ఆమ్ ఆద్మీ  పార్టీ సమన్వకర్త అరవింద్ కేజ్రీవాల్ అదే స్థానంలో నిలబడటం.  

దీనితో ఎన్నికల కమిషన్ బాధ్యతల్లో అతి ముఖ్యమైన అతి ప్రయాసతో కూడుకున్న పని ముగిసినట్లు.  ఇక మే 16 నుండి జరిగే వోట్ల లెక్కింపు కూడా అయిపోతే చెదురు మదురు రిపోలింగ్ లు వదిలి పెడితే, ఎన్నికల కమిషన్ హాయిగా ఊపిరి పీల్చుకోవచ్చు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles