Election commission takes aamir khan services

Election Commission takes Aamir Khan services, National icon Aamir Khan, Mahinder Singh Dhoni, Abdul Kalam Azad, Saina Nehwal, Mary Kom

Election Commission takes Aamir Khan services

ఎన్నికల కమిషన్ కి అమీర్ ఖాన్ సేవలు

Posted: 03/19/2014 01:24 PM IST
Election commission takes aamir khan services

హిందీ సినీ హీరో అమీర్ ఖాన్ ని 2014 లోక్ సభ ఎన్నికలకు జాతీయ ప్రతిరూపం (నేషనల్ ఐకాన్) గా ఎంచుకున్న ఎన్నికల కమిషన్ ఆయనకు దేశ సంక్షేమం దృష్ట్యా గురుతర బాధ్యతలను అప్పగించింది. 

దేశంలో వోటర్ చైతన్యం పెంచే ముఖ్యోద్దేశంతో ఎక్కువలో ఎక్కువమంది వోటు వెయ్యటం కోసం ప్రోత్సాహపూరితమైన కార్యక్రమాలు చెయ్యటమనే బాధ్యతను అమీర్ ఖాన్ కి అప్పగించింది ఎన్నికల కమిషన్.  హిందీ సినిమాలలో తన నటనతో ప్రేక్షకుల మనసు దోచుకున్న అమీర్ ఖాన్ టివి కార్యక్రమం సత్యమేవ జయతే ద్వారా దేశవాసులకు మరింత దగ్గరయ్యారు. 

వోటర్ చైతన్యం కోసం అమీర్ ఖాన్ మరో నలుగురు నేషనల్ ఐకాన్లతో కలిసి పనిచేస్తారు.  వాళ్ళు క్రికెట్ కెప్టెన్ మహేందర్ సింగ్ ధోనీ, బాక్సర్ మేరీ కోమ్, బాడ్మింటన్ స్టార్ సైనా నేహ్వాల్, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ ఆజాద్. 

ఈ ఐదుగురూ కలిసి సిస్టమేటిక్ వోటర్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్ట్రోరల్ పార్టిసిపేషన్ కార్యక్రమంలో ఎక్కువ మంది వోటర్లు వోటు వెయ్యటానికి ముందుకు వచ్చే విధంగా కార్యక్రమాలను రూపొందించి ప్రజలలో చైతన్యాన్ని పెంచే దిశగా కృషి చేస్తారు. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles