Feel control over life and be healthy

feel control over life and be healthy, Healthy life, Directions from a Guru, Health and long life with understanding

feel control over life and be healthy, Healthy life

సంపూర్ణారోగ్యానికి సూక్ష్మం, దీర్ఘాయుష్షుకు దగ్గరదారి

Posted: 02/05/2014 04:58 PM IST
Feel control over life and be healthy

విధి చేతిలో కీలుబొమ్మలం, నిమిత్తమాత్రులం, అనుకున్నదేమీ జరగదు అని నిరాశలో జీవించేవారికంటే ఎన్ని అడ్డంకులొచ్చినా నేను నా లక్ష్యాన్ని సాధిస్తాను అని పట్టుదలతో పనిచేసేవారి ఆరోగ్యం చాలా బాగుంటుందని, దీర్ఘాయుష్షుతో జీవిస్తారని పరిశోధనలో తేలింది. 

ఇది విద్యతో ఒనగూడేది కాదు.  జీవితానికి ఉపయోగపడే ఈ జ్ఞానం కలిగినవాళ్ళల్లో చదువుకున్నవారూ చదువుకోనివారూ సమానంగానే ఉంటారు.  పైగా అన్ని పనులనూ తను స్వనియంత్రణతో చేస్తున్న భావనలో ఉన్నవాళ్ళకి చదువులో తక్కువైనా ఆ లోపం కనపడదంటారు పరిశోధకులు. 

ఈ పరిశోధనను చెయ్యటానికి ముందుగా కొన్ని ప్రశ్నలకు సమాధానాలు రాబట్టి వాటి ద్వారా ఆయా వ్యక్తుల వ్యవహారశైలి, ఆత్మవిశ్వాసాల స్థాయిని గ్రహించి, దానితోపాటు వాళ్ళ విద్యార్హతలను కూడా పరిశీలించిన తర్వాత వాటన్నిటి ఫలితాలను క్రోడీకరించి ఈ నిర్ణయానికి వచ్చారు.

ఆధ్యాత్మికంలోకి వచ్చేసరికి మనిషిలోని గర్వం అహం నశించటం కోసమే నీ చేతిలో ఏమీ లేదు, అంతా ప్రకృతి, దాన్ని సృజించిన శక్తి చూసుకుంటుంది అని చెప్తారు.  ఏ క్షణంలోనైనా చనిపోవచ్చు.  మృత్యువు చెప్పిరాదు.  మీకు ఎటువంటి గడువునీ ఇవ్వదు అని చెప్తారు.  కానీ ఏ పని చేపట్టినా వంద సంవత్సరాలు జీవిస్తావనే నమ్మకంతోనే కొనసాగించమని కూడా చెప్తారు.  ముందు చెప్పింది అత్యాశతో ఇతరులను కొట్టి కూడబెట్టకుండా ఉండటం కోసం, రెండవది పని చెయ్యటానికి ప్రోత్సాహం కోసం. 

నిదానమే ప్రదానం అని చెప్పినవాళ్ళే ఆలస్యం అమృతం విషం అని కూడా అన్నారు.  సందర్భాన్ని బట్టి ఇటువంటి వాక్యాలను ప్రబోధిస్తుంటారు.  అందువలన ఎవరు చెప్పారు, ఎవరికి చెప్పారు, ఏ సందర్భంలో చెప్పారు అన్నది గ్రహించటం దాన్ని దృష్టిలో పెట్టుకోవటం చాలా ముఖ్యం. 

అందుకే కేవలం తమకు తాము చదువుకోవటం కాకుండా గురూపదేశం ఉండాలని, గురువులేని విద్య గుడ్డి విద్య అని చెప్పారు.  గురువు మార్గదర్శకంలో జీవితాన్ని కొనసాగించినప్పుడు గ్రంధాలలోని సూత్రాలకు సరైన భాష్యాలు లభిస్తాయి. 

పై పరిశోధనలో తెలుసుకున్నదేమిటంటే మీరు మీ జీవితాన్ని మీరుగా జీవించాలి.  జీవించటం వేరు, జీవంతో ఉండటం వేరు.  మీరు మీ జీవితాన్ని మీ చేతిలోకి తీసుకుని మీ అవగాహనలో పెట్టుకున్న లక్ష్యసాధన కోసం మీరుగా ప్రయత్నించండి.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles