Sunanda pushkar dead at leela hotel in delhi

Shashi Tharoor, Sunanda P Tharoor, Sunanda Pushkar, Leela Hotel in Delhi, Pakistani journalist

Sunanda Pushkar Tharoor, wife of union minister Shashi Tharoor, has been found dead at the five-star Leela Hotel in Delhi,

సునందా పుష్కర్ శవమై తేలింది

Posted: 01/17/2014 10:16 PM IST
Sunanda pushkar dead at leela hotel in delhi

కేంద్ర మంత్రి శశిథరూర్ భార్య సునందా పుష్కర్ ఢిల్లీలోని లీలా  హోటల్ లో  శవమై తేలింది. నిన్నటి వరకు పాకిస్థాన్ మహిళా జర్నలిస్టు మెహర్ తరార్ తో ట్విట్టర్ లో మాటల యుద్దం సాగించిన సునంద ఇరవై నాలుగు గంటలు గడవక ముందే శవమై తేలడంతో రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది.

ఈమె మరణానికి సరైన కారణం ఇంత వరకు పోలీసులు వెల్లడించలేదు. దీని పై ప్రాథమిక విచారణ జరిపిన పోలీసులు ఆత్మహత్యకు పాల్పడ్డట్లు తెలిపారు. 2010లో వివాహం చేసుకున్న శశి థరూర్, సునంద మధ్య గతకొద్ది రోజులుగా విభేదాలు కొనసాగుతున్నట్లు  వార్తలు వచ్చాయి. నిన్నటి వరకు ట్విట్టర్ లో పాకిస్థాన్ జర్నలిస్టు పై ట్విట్టర్ లో వ్యాఖ్యానిస్తూ... తన భర్తను వలలో వేసుకునేందుకు మెహర్ ప్రయత్నించిందని ట్విటర్లో సునంద పోస్ట్ చేశారు.

ఈ వివాదంతో విసిగిపోయానని, థరూర్‌కు విడాకులు ఇవ్వాలనుకుంటున్నట్టు చెప్పిన ఆమె... ఆ తరువాత మీడియా ముందుకు వచ్చి మా ఖాతాలను ఎవరో హ్యాక్ చేశారని సంయుక్త ప్రకటన చేసిన తరువాత వివాదం సమసి పోయిందని అనుకున్న తరుణంలో ఈమె మరణం పలు అనుమానాలకు తావిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles