Nirbhaya case accused guilty quantum sentence tomorrow

Delhi gang-rape case, December 16 gang-rape case, Delhi gangrape, Nirbhaya gang rape, Saket court, Delhi court

Nirbhaya case: accused guilty quantum sentence tomorrow.

దోషులుగా గుర్తింపు - శిక్ష రేపు ఖరారు

Posted: 09/10/2013 01:51 PM IST
Nirbhaya case accused guilty quantum sentence tomorrow

ఢిల్లీలో గత కొన్ని నెలల క్రితం జరిగిన అంత్యంత దారుణంగా మెడికల్ విద్యార్థి పై సామూహిక అత్యాచారం సంఘటన దేశ వ్యాప్తంగా అలజడి రేపిన విషయం తెలిసిందే. ఈ సంఘటనకు సంబంధించిన కేసు తుది అంకానికి వచ్చింది. ఈ కేసులో నింధితులకు నేడు కోర్టు శిక్షను ఖరారు చేయాల్సి ఉంది. అయితే విచారణ చేటట్టిన న్యాయస్థానం ఈ సంఘటనలో నిందితులుగా ఉన్న .. ముఖేశ్, పవన్ గుప్తా, వినయ్‌శర్మ, అక్షయ్ ఠాకూర్‌లను దోషులుగా గుర్తించింది.  వీరికి శిక్షను రేపు ఖరారు చేయనున్నట్లు అదనపు సెషన్స్ జడ్జి యోగేష్ ఖన్నా తెలిపారు. దోషుల వాదనలు విన్న తరువాత వీరికి శిక్ష ఖరారు కానుంది. నిందితులు నలుగురిపై 13 సెక్షన్ల కింద అభియోగాలు నమోదయ్యాయి. 84 మంది సాక్షులను ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ జరిపారు. వీరిపై హత్య, అత్యాచారం, కిడ్నాప్ నేరాలు నిర్ధారణ అయ్యాయి. ఈ కేసులో ప్రధాన నింధితుడు రాంసింగ్ చనిపోగా, మరొక నింధితుడు మైనర్ కావడంతో అతనికి కోర్టు మూడు సంవత్సరాల శిక్షను ఖరారు చేసింది. ఇక మిగిలిన వారికి శిక్షను ఖరారు చేస్తే ఈ సంఘటనలో అందరికి శిక్ష పడినట్లవుతుంది. మరో వైపు నిర్భయ కేసులో నిందితులకు కచ్చితంగా ఉరిశిక్ష అమలు చేయాలని నిర్భయ కుటుంబీకులు, మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నారు. కచ్చితంగా న్యాయం జరుగుతుందన్న నమ్మకం తమకు ఉందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. రేపు 11 గంటల తరువాత ఈ తీర్పు వెల్లడవుతుందని న్యాయవాది చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles