Telugu talli statue vizag

Telugu Talli statue Vizag, Ganta Srinivasa Rao, Antony Committee, CWC decision on State Bifurcation, Resignations for Samaikyandhra

Telugu Talli statue Vizag

నాకు ప్రజలే హైకమాండ్- గంటా

Posted: 08/16/2013 10:47 AM IST
Telugu talli statue vizag

విశాఖపట్నంలో మద్దిపాలెం జంక్షన్ లో తెలుగుతల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు తనకు హైకమాండ్ ప్రజలేనని అన్నారు.  ప్రజల అభీష్టానికి అనుకూలంగా కాంగ్రెస్ పార్టీ తన రాష్ట్ర వేర్పాటు నిర్ణయాన్ని పునర్విచారణ చేయాలని సూచించారాయన. 

ఇప్పటికే తాను రాజీనామా చేసానని ప్రకటించిన గంటా, దానికే కట్టుబడి వుంటానని, కేబినెట్ లో ఉండేది లేదని స్పష్టం చేస్తూ, కాంగ్రెస్ వ్యవహారం ఇలాగే సాగితే ఇప్పటికే కొందరు శాసన సభ్యులు, పార్లమెంటు సభ్యుల, శాసన మండలి సభ్యులు రాజీనామా చేసారు, మిగిలినవారు కూడా ఆ దారే పడతారంటూ హెచ్చరించారు. 

ఢిల్లీలోనో లేకపోతే హైద్రాబాద్ లోనో కూర్చుని తమ దగ్గరికి వచ్చే వాళ్ళనుంచి విషయ సేకరణ చేసినంత మాత్రాన సరిపోదని, ఆంటోనీ కమిటీ ఢిల్లీ నుంచి కదిలి జిల్లాలలోకి వస్తే గానీ సమైక్యాంధ్ర ఉద్యమ నిజస్వరూపం చూడటం, నిజమైన అవగాహనకు రావటం కుదరదని అన్నారు గంటా శ్రీనివాసరావు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles