Political trs mla harish rao fire on tdp

TRS MLA Harish rao fire on TDP, trs party, telugudesam party, trs mla harish rao, tdp leaders, telangana issue, telangana state,

TRS MLA Harish rao fire on TDP

టిడిపిలో గుబులు రేపిన కేసిఆర్ అల్లుడు?

Posted: 06/21/2013 04:01 PM IST
Political trs mla harish rao fire on tdp

తెలుగుదేశం పార్టీ నాయకులకు టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్ రావు షాక్ న్యూస్ చెప్పటంతో టిడిపి నేతలు అయోమయంలో పడ్డారు. త్వరలో తెలుగుదేశం పార్టీ ఖాళీ అవుతుందని హరీష్ రావు్ మీడియాతో చెప్పటంతో టీడీపీ నేతల్లో గుబులు రేగుతుంది. హరీష్ రావు చేసిన ఆరోపణలు బలంగా ఉన్నట్లు సమాచారం. ఇప్పటికీ 8 మంది ఆ పార్టీ ఎమ్మెల్యేలు తమకు 'టచ్ ’ లో ఉన్నారని ఎమ్మెల్యే హరీశ్ రావు తెలిపారు. టీడీపీ నేతలు మతిభ్రమించి మాట్లాడుతున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. తమపై అసత్య ప్రచారం చేస్తూ ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆ పార్టీ నేతలపై హరీష్ రావు మండిపడ్డారు. తమ పార్టీ జోలికి వస్తే ఏం జరుగుతుంది త్వరలో మేము చూపిస్తామని హరీష్ రావు అంటున్నారు. కాంగ్రెస్ పార్టీతో టిడిపి కలిసి దొంగనాటకాలు ఆడుతుందని ఆయన అన్నారు. 8 మంది ఎమ్మెల్యేల కోసం మా పార్టీ నాయకుడు కడియంతో చర్చలు జరుపుతున్నారని హరీశ్ రావు అన్నారు. త్వరలో టిడిపిలో తెలంగాణ నాయకులు ఎవరు ఉండరని హరీశ్ రావు అంటున్నారు. హరీశ్ రావు చేసిన ఆరోపణాలపై టిడిపి నాయకులు ఏమంటారో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles