చలో అసెంబ్లీ కార్యక్రమానికి అనుమతి సాద్యం కాదని పోలీస్ కమిషన్ అనురాగ్ శర్మ స్పష్టం చేశారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితుల్లో అనుమతిచ్చే ప్రసక్తే లేదని, చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గతంలో పలు ఉద్యమాలకు తాము అనుమతులివ్వడం జరగిందని కొన్ని ఉదహరించారు. ర్యాలి చేపడుతున్న రోజు మద్యం దుకాణాలు, బార్లు మూసివేయించడం జరుగుతుందని, నగరానికి వచ్చే ప్రధాన రహదారుల వెంట పలు చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. గతంలో తాము అనుమతిచ్చినా హింస చెలరేగిందని 'మిలియన్ మార్చ్' ఘటనను ఉదహరించారు.
ఈ ఉద్యమంలో యువకులు, ఉద్యోగులు పాల్గొన కూడదని ఆయన సూచించారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యం..తాజా పరిస్థితి దృష్ట్యా భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని సిపి అనురాగ్ శర్మ ప్రకటించారు. 17 మంది ఎస్పీ స్థాయి అధికారులు, 30 మంది డిఎస్పీలు, 50 మంది ఇన్ స్పెక్టర్లు, 30 మంది సబ్ ఇన్ స్పెక్టర్లు, 800మంది హెడ్ కానిస్టేబుల్స్, 190 ఫ్టాటున్న సిబ్బంది బందోబస్తులో పాల్గొంటారని ఆయన తెలిపారు. చట్టాని ఎవరూ చేతుల్లోకి తీసుకోవద్దని ఆయన సూచించారు.ఎవరైనా అతిక్రమిస్తే తాము కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more