రైతు సమస్యలపై అసెంబ్లీ చాంబర్ ఎదుట టిఆర్ఎస్ ఎమ్మెల్యే లు బెఠాయించారు. తమ రైతులకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిస్తూ టిఆర్‌ఎస్ సభ్యులు అంతకు ముందు రెవిన్యూ మంత్రి రఘువీరారెడ్డిని కలిసి ఇదే విషయంపై నిలదీశారు. మంత్రికి వినతిపత్రం ఇచ్చారు. సీమాంధ్ర రైతులను ఆదుకోవడంలో చూపిన చొరవ తమ అన్నదాతలపై చూపడం లేదెందుకుని వారు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. అంతకు ముందు తెలంగాణలో నీలం తుపాన్ బాధితులైన రైతులకు సహాయం చేయడంలో ప్రభుత్వం విఫలమైందని టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు సీఎం ఛాంబర్ ముందు గంటకు పైగా ధర్నా చేశారు. రెండోసారి సభ వాయిదా తర్వాత తన ఛాంబర్‌లోకి వెళుతూ.... డ్రామాలాపండి, లోపలికి వచ్చి మాట్లాడండి అంటూ సీఎం... టిఆర్‌ఎస్ సభ్యులతో చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి.
ఈ విషయం పై ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అసంత్రుప్తి వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి చాంబర్ లోకి మాట్లాడండి అని సూచించారు. అయితే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రితో సమావేశం అయ్యారు. టిఆర్ఎస్ ముఖ్యమంత్రి మద్య సమావేశం 30 నిమిషాలు పాటు సాగింది. టిఆర్ఎస్ ఎమ్యెల్యేలు తమ సమస్యలను ‘చలో అసెంబ్లీ ’ అనుమతి కావాలనే డిమాండ్ ను గట్టిగా వినిపించారు. ఆ సమయంలో కొంత మంది ఎమ్మెల్యేలు సీఎంతో నోటిదురుసుగా మాట్లాడినట్లు సమాచారం. ఆసమయంలో ముఖ్యమంత్రి డ్రామాలోద్దని వారికి సూచించారు. సీఎం మాటలకు టిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు తీవ్రంగా మండిపడ్డారు. డ్రామాలు ఆడుతుంది మీరా? మేమా? అంటూ హరీశ్ రావు సీఎం ను అడిగినట్లు సమాచారం.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more