Mahatma gandhi personal items letters up for auction

mahatma gandhi, gandhi letter to be auctioned in uk, important letter gandhi wrote in 1937, sarath gopal, hyderabad, kirshna district,

mahatma gandhi personal items, letters up for auction

గాంధీ లేఖలను సొంత చేసుకున్న నగర వాసి

Posted: 05/11/2013 09:43 AM IST
Mahatma gandhi personal items letters up for auction

జాతిపిత అయిన మహాత్మాగాంధీ ఉన్న అభిమానం ఏమిటో మన హైదరాబాద్ వ్యక్తి చూపించాడు. మాది కృష్ణాజిల్లా గుడివాడ దగ్గర పెంజర్ల. మా కుటుంబానికి స్వాతంత్య్ర పోరాట నేపథ్యం ఉంది. చిన్నప్పటి నుంచీ గాంధీ మహాత్ముడిపై అప్పట్నుంచే ఆరాధనా భావం ఏర్పడింది. మహాత్ముడి దస్తూరితో రాసిన లేఖలు వేలం వేస్తున్నారని తెలిసినప్పుడు రూ.50 లక్షలైనా వెనకాడకుండా వేలంలో పాల్గొన్నాను. ఈ లేఖల్ని అందుకున్న రోజున.. నా జీవితానికి ఇంతకంటే సార్థకత లేదనిపించింది.. జాతిపిత మహాత్మాగాంధీ రాసినరెండు లేఖలను హైదరాబాద్‌కు చెందిన శరత్ గోపాల్ అనే వ్యాపారవేత్త వేలంలో సొంతం చేసుకున్నారు.

1892లో సబర్మతి జైలు నుంచి రవీంద్రనాథ్ ఠాగూర్ అన్నయ్య ద్విజేంద్రనాథ్ ఠాగూర్‌కు రాసిన లేఖతో పాటు, మరో మిత్రుడికి రాసిన ఉత్తరాన్ని గత డిసెంబర్ 12న లండన్‌లో వేలానికి పెట్టారు. 25 దేశాలకు చెందినవారు ఈ వేలంలో పాల్గొనగా.. 56,950 పౌండ్లకు (రూ.50,11,600) శరత్ గోపాల్ వీటిని సొంతం చేసుకున్నారు. భారతదేశానికి చెందిన ఈ లేఖల్ని లండన్‌లో వేలం వేయడాన్ని అప్పట్లో భారత ప్రభుత్వం వ్యతిరేకించింది. కాగా.. ఆ ఉత్తరాలను భారతీయుడే కైవసం చేసుకోవడంతో ఉత్తరాల్ని ఇండియాకు తెచ్చినప్పుడు కస్టమ్స్ సుంకం తొలగించడంతో పాటు, ప్రత్యేక దిగుమతి లైసెన్స్ ఇచ్చి సహకరించింది. వారం రోజుల క్రితం శరత్ గోపాల్ వాటిని ఇక్కడ అందుకున్నారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles