Nation wide emploees strike for two days

workers, unions, strikes, political parties, singareni collieries

nation wide emploees strike for two days started today

labour-strike.png

Posted: 02/20/2013 09:09 AM IST
Nation wide emploees strike for two days

singareni_workers

     ఈరోజు, రేపు దేశ వ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక సమ్మె హైద్రాబాద్ లో ప్రభావం చూపే సూచనలు బాగానే కనిపిస్తున్నాయి.  బ్యాంకులు, ప్రైవేటు రవాణా సంస్థలు, సమ్మెలో పాల్గొంటున్నాయి.  ఆర్ టి సి బస్సుల కదలికల్లో కూడా ఈ సమ్మె వలన ప్రతిబంధకం ఏర్పడేటట్టుగా ఉంది.  ఆర్ టి సి గుర్తింపు సంఘం ఎంప్లాయీస్ యూనియన్ కి చెందిన 40 వేల మంది కార్మికులు ఈ సమ్మెలో పాల్గొనబోవటమే అందుకు కారణం.  సమ్మెలో ఆటో యూనియన్లు కూడా పాల్గొనటం వలన ఆటోలు తిరగటం కూడా ఉండదు.  108 ఆంబులెన్స్ సేవలను అత్యవసర సేవల కిందికి తెచ్చి అందులో పనిచేసే కార్మికుల మీద ఎస్మా విధించారు.  కానీ 104 సిబ్బందిలో కొంతమంది సమ్మెలో పాల్గొంటున్నారు.  అందువలన ప్రజలకు ఇబ్బంది కలుగకుండా ఉండటం కోసం పోలీసులు తగిన చర్యలు తీసుకుంటున్నారు.  ఈ సేవలను అడ్డుకునే ప్రయత్నం ఎవరైనా చేసినట్లయితే వెంటనే పోలీసు అధికారులకు సూచన ఇవ్వమని చెప్తున్నారు. 

     పదకొండు కార్మిక సంఘాలు పాల్గొంటున్నందువలన ఈ సమ్మె వలన దేశంలో పలు ప్రాంతాల్లో సామాన్య జనజీవనానికి ఆటంకం కలిగే పరిస్థితి నెలకొంది.   తెరాస, తెలంగాణా యునైటెడ్ ఫ్రంట్, తెలుగునాడు, తెలంగాణా ప్రజా ఫ్రంట్ లు సమ్మెకు మద్దతుని ప్రకటించాయి.

     తెలంగాణా ప్రాంతంలోని సింగరేణి బొగ్గు కార్మికులు, పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు లో జ్యూట్ మిల్లు కార్మికులు ఇప్పటికే విధులను బహిష్కరించి ఆందోళన చేస్తున్నారు.  బ్యాంక్ ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొనవద్దని కేంద్ర ప్రభుత్వం కోరినా, వారు దాన్ని లెక్కపెట్టకుండా సమ్మె చెయ్యటానికే నిర్ణయించుకున్నారు.

     సమ్మెకు కారణాలు- చిల్లర వ్యాపారంలో విదేశీ పెట్టుబడులు, ధరల పెంపు, ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరించటం, కార్మికుల కనీస వేతనాన్ని 10000 రూపాయలకు పెంచటం, ఇలా పది డిమాండ్లతో కార్మక సంఘాలు సమ్మెకు దిగాయి.  కాంగ్రెస్, భాజపా మద్దతులో పనిచేసే కార్మిక సంఘాలు ఐఎన్ టియుసీ, బిఎమ్ సి లు రెండూ సమ్మెలో పాల్గొంటున్నాయి. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles