Cm morphed photo in circulation online

cm kirankumarreddy, morphing photo, internet, telangana muddu bidda, hyderabad , trs vidhyardhi sangam, telangana issue, cyber police case, telangana, trs, kiran kumar reddy, morphed pictures, social media campaign, hyderabad central police, cyber crime, statehood demand

cm morphed photo in circulation online.The city police on Wednesday launched a probe into the circulation of a morphed picture of Chief Minister N. Kiran Kumar Reddy on the internet, along with abusive comments, by pro-Telangana activists

cm-morphed -photo.gif

Posted: 02/14/2013 10:45 AM IST
Cm morphed photo in circulation online

cm morphed photo in circulation online

పెరుగుతున్న టెక్నాలజీతో  సమాజంలో చేడు విపరీతంగా పెరిగిపోతుంది. మొన్నటి వరకు  బ్రహ్మనందం పై కామెడీ  ఫోట్లో  మార్పింగ్ చేసి , ఇంటర్ నెట్ లో పెడితే వాటిని చూసి ప్రజలు నవ్వుకున్నారు.  ఆ తరువాత  చిరంజీవి, బాలక్రిష్ణల మీద అసభ్యంగా ఫోటోలు మార్పింగ్ చేసి  వెబ్ సైట్ లలో వదిలారు. వాటిని  బాలయ్య సీరియస్ తీసుకోవటంతో .. ఇప్పుడు వాటికి బ్రేక్ పడింది. తాజాగా  మన రాష్ట్ర ముఖ్యమంత్రి  నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఫోటో తో జిమ్మిక్కులు చేస్తున్నారు. రోజురోజుకి విప్లవాత్మకమైన మార్పులతో అందుబాటులోకి వస్తున్న సాంకేతిక పరిజ్ఞానం పలు రకాలుగా దుర్వినియోగం కూడా అవుతోంది. తెలంగాణకు చెందిన ఓ వెబ్‌సైట్‌లో రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఫోటోను మార్ఫింగ్ చేసి, అసభ్యకరంగా సృష్టించారని, అంతేగాక, పరుషపదజాలంతో దూషించే విధంగా వ్యాఖ్యలు చేసిన బాధ్యులను వెంటనే గుర్తించి, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మద్దినేని అజయ్ సైబర్‌క్రైమ్ డిప్యూటీ డైరెక్టర్ జాఫర్ జావెద్‌కు ఫిర్యాదు చేసినట్లు తెల్సింది. అయితే మార్ఫింగ్ చేసి, అసభ్యకరమైన పదజాలంతో ఉన్న కామెంట్లు తెలంగాణకు చెందిన ఓ విద్యార్థి సంఘం పేరిట ఉన్నట్లు కూడా ఆయన వెల్లడించారు. ఫిర్యాదు ఇచ్చిన అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఫొటోను ఈ రకంగా అసభ్యకరంగా చిత్రీకరించటం పట్ల తెలంగాణ ప్రజలు సిగ్గుపడాల్సిన విషయమన్నారు. ఆయనతో పాటు కాంగ్రెస్ పార్టీ నేతలు బిక్కునాయక్, అశోక్‌ముదిరాజ్, చందూ తదితరులు ఫిర్యాదు చేసినట్లు  సమాచారం

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Married man arrested
Vhp bajrang dal warn against valentine day  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles