Mp spy reddy statement of resignation

spy reddy, srisailam water, resignation, sakshitvcom news, sakshitvcom, sakshi news bulletin, telugu media, telugu, media, Sakshi TV, sakshitv, sakshi, TV, Television, indira television, latest news, ap news, news, live tv, telugu news, telugu news channels, breaking news, Andhra Wishesh

Nandyal MP Spy Reddy Statement of Resignation..

MP Spy Reddy Statement of Resignation.png

Posted: 08/31/2012 04:06 PM IST
Mp spy reddy statement of resignation

SPY-Reddyరాయలసీమ ప్రముఖ నాయకుడు, కర్నూలు జిల్లా నంద్యాల  పార్లమెంటు సభ్యుడు ఎస్పీవై రెడ్డి తన పదవికి రాజీనామా చేసే యోచనలో ఉన్నారు. తన సొంత జిల్లా కర్నూలుకు నీటి కేటాయింపులలో అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ ఆయన రాజీనామా చేసేందుకు సిద్ధపడ్డారు. ఎస్పీవై రెడ్డి తన రాజీనామాను లోకసభ స్పీకర్ మీరా కుమార్‌కు ఇచ్చేందుకు సిద్ధపడ్డారు. అయితే ఆయన తన ఎంపీ పదవితో పాటు కాంగ్రెస్ పార్టీకి కూడా గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఎస్పీవై రెడ్డి వైయస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. ఈయన నీటికేటాయింపులను సాకుగా చూపి రాజీనామా చేసే యోచనలో ఉన్నా, అంతర్గతంగా మాత్రం పార్టీ భవిష్యత్ గురించి అలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాడని అంటున్నారు. తన పదవికి రాజీనామా చేసిన తరువాత ఆయన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు మెండుగా ఉన్నాయంటున్నారు. త్వరలో ఈ విషయం పై వైయస్ విజయమ్మను కూడా కలిసే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఒక వేళ ఎస్పీవై రెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ లో చేరితే కాంగ్రెస్ పార్టీకి కర్నూలు జిల్లాలో పెద్ద దెబ్బతగిలినట్లేనని భావించవచ్చు.

తను పార్టీ మారుతున్నాని వస్తున్న వార్తల పై స్పందించిన ఎస్పీవై రెడ్డి ఆ వార్తలను ఖండించారు. తాను రాజీనామా చేసిన కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని అంటున్నారు. అయితే రాజకీయంలో ఏ క్షణానికి ఏమి జరుగునో మనం ఊహించలేం కాబట్టి ఎస్పీవై రెడ్డి కాంగ్రెస్ లో ఉంటాడా ? వైయస్సార్ సీపీలో చేరుతాడా అనేది తేలాలంటే వేచి చూడాల్సిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Aditi mukherji first winner award
Blue moon fills sky tonight  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles