Ysr daughter forays into politics

YSR daughter forays into politics, Chandra babu naidu, CM Kiran, Congress Party, Telugudesam party, Pattipadu,

YSR daughter forays into politics

YSR.gif

Posted: 06/02/2012 11:14 AM IST
Ysr daughter forays into politics

YSR daughter forays into politics

ప్రత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గంపై తెలుగుదేశంపార్టీ ఎన్నో ఆశలు పెట్టుకొంది. టిడిపి తరఫున గత ఎన్నికల్లో పోటీచేసి 2వేల ఓట్ల తేడాతో ఓడిపోయిన కందుకూరి వీరయ్య తిరిగి పోటీపడుతుండగా, వైఎస్సార్ కాంగ్రెస్ తరఫున తాజామాజీ ఎమ్మెల్యే మేకతోటి సుచరిత బరిలో ఉన్నారు. కాంగ్రెస్‌పార్టీ తరఫున యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు టిజెఆర్ సుధాకర్ బాబు పోటీచేస్తున్నారు. నియోజకవర్గంలో 2లక్షల 12వేల 880మంది ఓటర్లు ఉండగా, సుమారు 40వేలకు పైగా కమ్మ సామాజికవర్గ ఓట్లు ఉండటంతోత్రిముఖపోటీలో ఈసారి ఎలాగైనా ఇక్కడ పాగా వేయాలని తెలుగుదేశం ప్రయత్నిస్తోంది. ఎస్సీ రిజర్వ్‌డ్ అయిన ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీలు మాల సామాజికవర్గానికి చెందిన వారికి టిక్కెట్లు ఇవ్వగా, టిడిపి తెలివిగా మాదిగ సామాజికవర్గానికి చెందిన కందుకూరి వీరయ్యకు టిక్కెట్ కేటాయించి ఆ వర్గం ఓట్లను తమవైపునకు తిప్పుకునేలా వ్యూహరచన చేస్తోంది.

పౌరుషాల పురిటిగడ్డ గుంటూరు జిల్లాలో 47 డిగ్రీల ఉష్ణోగ్రతలతో ఓవైపు ఎండ మండుతుంటే... అందుకు తగ్గట్టుగానే రాజకీయాలు కూడా తారస్థాయికి చేరుకున్నాయి. జిల్లాలోని ప్రత్తిపాడు, మాచర్ల అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలైన వైస్సార్‌కాంగ్రెస్, టిడిపి, కాంగ్రెస్ పార్టీలో ప్రచారంలో తలమునకలై ఉన్నాయి. జగన్ అరెస్ట్, విజయమ్మ ప్రచారరంగంలోకి రాకముందు నెలకొన్న పరిణామాలు గత నాలుగైదురోజుల్లో పూర్తిగా మారిపోవడంతో కాంగ్రెస్, టిడిపిలు తలపట్టుకున్నాయి. జిల్లాలోని రెండు అసెంబ్లీ స్థానాల్లో వైస్సార్ కాంగ్రెస్, టిడిపిలు హోరాహోరీగా తలపడుతుండగా, కాంగ్రెస్ ఇప్పటికే మూడో స్థానంలోనే ఉంది. ముఖ్యంగా జగన్ అరెస్ట్ తర్వాత రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. దానికితోడు గత మూడురోజులుగా కోస్తాజిల్లాల్లో విజయమ్మ నిర్వహిస్తున్న ఎన్నికల పర్యటనకు లభిస్తున్న స్పందన కాంగ్రెస్, టిడిపిల గుండెల్లో రైళ్లు పరుగెట్టిస్తున్నాయి. ఈ నెల 3వ తేదీన విజయమ్మ ప్రత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారానికి రానుండటంతో కాంగ్రెస్, టిడిపి నేతలు ఏంచేయాలో పాలుపోవడంలేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  I am not involved in gali bail scam says minister erasu prathap
Special cbi judge pattabhi ramarao suspended on corruption charges  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles